కుల్‌భూషణ్ జాదవ్ కేసు: తాళి తీయించారు.. చెప్పులూ ఇవ్వలేదు.. ఇదీ పాక్ తీరు!
న్యూఢిల్లీ: తమ జాతి పిత పుట్టిన రోజు.. మానవతా దృక్పథం అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన పాకిస్తాన్.. కుక్క తోక వంకర అన్నట్లు మళ్లీ కుల్‌భూషణ్ జాదవ్ వ్యవహారంలో తన నిజ స్వరూపాన్నే చాటుకుంది.
కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు ఆయన భార్య, తల్లిని అనుమతించిన పాక్.. వాళ్లతో ఎంత దారుణంగా వ్యవహరించిందో ఇండియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య ఉన్న అవగాహనకు విరుద్ధంగా ఈ సమావేశం జరిగిందని స్పష్టంచేసింది.

'భద్రతా కారణాలంటూ వాళ్లతో దారుణంగా వ్యవహరించారు. వాళ్ల మత, సాంప్రదాయాలకు కనీస విలువ ఇవ్వలేదు. కుల్‌భూషణ్ భార్య మంగళసూత్రం, గాజులు, బొట్టు తీయించారు. భద్రతకూ దీనికీ సంబంధం ఏంటి?' అని పాకిస్తాన్‌ను ఇండియా నిలదీసింది.
వాళ్లను కనీసం మాతృభాషలో మాట్లాడనివ్వలేదని, పదేపదే అడ్డుపడ్డారని ఆరోపించింది. సమావేశం తర్వాత జాదవ్ భార్య చెప్పులు కూడా తిరిగి ఇవ్వలేదని, దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చనే అనుమానం తమకు ఉందని.. భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు.
కుల్‌భూషణ్ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారని, నిర్బంధంలో ఉన్నట్లుగా ఆయన మాట్లాడారని, జాదవ్ పరిస్థితి చూస్తుంటే.. ఆరోగ్యం కూడా సరిగా ఉన్నట్లు అనిపించలేదని అనుమానం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్‌లో తాను విద్రోహ చర్యలకు పాల్పడినట్లుగా బెదిరించి ఆయనతో చెప్పించినట్లు తెలుస్తోందని రవీష్ స్పష్టంచేశారు. సోమవారం కుల్‌భూషణ్‌ను కలిసి తిరిగి స్వదేశానికి వచ్చిన ఆయన తల్లి, భార్య.. మంగళవారం కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలవడంతో పాక్ అధికారుల ప్రవర్తనకు సంబంధించి మరింత సమాచారం అందింది.
#WATCH MEA spokesperson Raveesh Kumar on meeting of #KulbhushanJadhav's mother and wife with Jadhav in Islamabad pic.twitter.com/O6HkKoc7WK
— ANI (@ANI) December 26, 2017
-
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications