‘శ్రీదేవి’కి ఏదీ ప్రాధాన్యత: ఢిల్లీ పత్రికలపై ఖుష్బూ ఆగ్రహం
న్యూఢిల్లీ: భారత దిగ్గజ సినీ నటి శ్రీదేవి మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణవార్తను జాతీయ మీడియాతోపాటు అంతర్జాతీయ మీడియా కూడా పతాక శీర్షికల్లో ప్రచురితం చేశాయి. అయితే, ఢిల్లీ మీడియా మాత్రం ముఖ్యంగా పత్రికలు ప్రాధాన్యత ఇవ్వకపోడంపై ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాంతీయ వార్తా పత్రికల నుంచి బీబీసీ, స్కై న్యూస్ వంటి అంతర్జాతీయ పత్రికల వరకు శ్రీదేవి, ఆమె నటించిన సినిమాల గురించి ప్రధానంగా పేర్కొన్నాయి. కానీ, దేశ రాజధాని ఢిల్లీకి చెందిన వార్తా పత్రికల్లో మాత్రం అసలు శ్రీదేవి నటించిన తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ సినిమాల జాడే కన్పించలేదు. దీంతో ఖుష్బూ ఢిల్లీ మీడియా వర్గాలపై మండిపడ్డారు.
i have been saying the same.. https://t.co/6WtzHWlzHS
— khushbusundar (@khushsundar) February 26, 2018
'ఢిల్లీకి చెందిన ఏ వార్తా పత్రికలో శ్రీదేవి నటించిన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల గురించి ఒక్క వార్త కూడా రాయలేదు. ఇది నిజంగా బాధాకరం. ఈ నాలుగు భాషల్లో ఆమె సూపర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్నాకే బాలీవుడ్‌కు వెళ్లారు' అని ఓ ఆంగ్ల పత్రిక పాత్రికేయుడు జక్కా జాకోబ్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌ను ఖుష్బూ రీట్వీట్ చేస్తూ..'అప్పటి నుంచి నేనూ ఇదే విషయం చెబుతున్నాను' అంటూ పేర్కొన్నారు. శ్రీదేవి బాలీవుడ్ కంటే కూడా దక్షిణాది చిత్రాల్లోనే ఎక్కువగా నటించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం శ్రీదేవి మృతదేహాన్ని దుబాయ్ నుంచి ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
-
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా?












Click it and Unblock the Notifications