ప్రజలతోనే దీపావళి: జయను కలిసిన ఖుస్బూ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కాంగ్రెస్ నేత, నటి ఖుష్బూ సోమవారం కలిశారు. అనారోగ్య కారణంగా జయలలిత గత కొద్దిరోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలితను చూసి వచ్చినట్లు ఖుష్బూ ట్వీట్ చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి బావుందని, మరింత త్వరగా ఆమె కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఈ దీపావళిని జయలలిత తమిళనాడు ప్రజలతో జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు ఖుష్బూ ట్వీట్టర్ ద్వారా ఆకాంక్షించారు. ఇది ఇలా ఉండగా, సోమవారం జయలలితకు వైద్యం అందించేందుకు లండన్ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు గిల్సానీలు అపోలో ఆస్పత్రికి వచ్చారు. వీరితోపాటు సింగపూర్‌కు చెందిన వైద్యులు జయలలితకు వైద్యం అందిస్తున్నారు.
కాగా, ఇప్పటికే జయలలిత కొంత కోలుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
Just visited our H'ble CM at Apollo..she is progressing well..wishing her a speedy recovery n wish she spends this diwali with ppl of TN.
— khushbusundar (@khushsundar) 24 October 2016
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications