ఒక్క గంటలో కోటీశ్వరుడు అయిన వలస కూలీ.. రూ. 3 కోట్ల జాక్ పాట్.. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావ్ అన్నా..!
మనలో చాలా మందికి దరిద్రం ప్రతిసారీ తలుపు తడుతుంది.. అదృష్టం మాత్రం లైఫ్ లో ఒక్కసారే తలుపు తడుతుంది. ఆ సమయంలో తలుపు తీయకపోతే లచ్చిందేవి వెనక్కు వెళ్లిపోతుంది. ఇక ఓవర్ నైట్ లో స్టార్ హీరోలు అయి పోయిన వాళ్లు ఉన్నారు. అలాగే ఓవర్ నైట్ లో కోటీశ్వరులు అయిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఒకే ఒక గంటలో కోటీశ్వరుడు అయిన ఓ వ్యక్తి గురించి మీరు విన్నారా..? అది కూడా ఓ వలస కూలీ.. ఒక్క గంటలోనే ఏకంగా రూ. 3 కోట్ల జాక్ పాట్ కొట్టాడు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం.. కొన్ని గంటల వరకూ కూలీ పని కోసం రోడ్ల వెంట నిలబడిన ఆ వ్యక్తి ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. దీన్ని బట్టి అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వలస కూలీ కోటీశ్వరుడు కావడంపై నెటిజన్లు అతనికి కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఏం జరిగిందంటే..?
మధు అనే ఓ వలస కూలీ వెస్ట్ బెంగాల్ కు చెందినవాడు. అయితే పనికోసం పంజాబ్ లోని జలంధర్ కు వచ్చాడు. అక్కడ ఫగ్వారా సమీపంలోని బంగా దాని పరిసర ప్రాంతాల్లో వ్యయసాయ కూలీగా పనులు చేస్తూ దాంతో వచ్చే కూలీతోనే తన కుటుంబాన్ని నడిపేవాడు. అయితే మధుకు అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టింది. అతని కుటుంబాన్నే మార్చేసింది. రోజూవారీలాగే కూలీ పనులకు వెళ్లిన మధు మార్గమధ్యలో బంగాలోని సహోటా లాటరీ స్టాల్ వద్ద ఆగి మరో గంటలో లాటరీ ఫలితాలు వెలువడతాయనంగా ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. సాధారణంగా ఏమీ ఆలోచించకుండా అలా కొనేశాడు. అయితే అదే తన జీవితాన్ని మార్చేస్తుందని ముందుగా ఊహించలేకపోయాడు.

ఇక సాయంత్రం 6 గంటల సమయంలో లాటరీ టికెట్ ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల్లో మధు కొనుగోలు చేసిన టికెట్ కు లాటరీ తగిలినట్లు తెలిసింది. ఈ విషయాన్ని లాటరీ కార్యక్రమం నిర్వాహకులు వెల్లడించారు. బంగా చరిత్రలోనే తొలిసారిగా మధు ఏకంగా రూ. 3 కోట్ల లాటరీని గెలుచుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మధు, అతని కుటుంబం, బంధువులు ఎగిరి గంతేశారు. సంబరాలు చేసుకున్నారు. కూలీగా ఉన్న మధు ఉన్నంట్టుండి ఒక్కసారిగా కోటీశ్వరుడు కాబోతున్నాడంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఈ లాటరీ టికెట్ క్లెయిమ్ ప్రాసెస్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications
