Labors: డ్రైవర్ల నిర్లక్షం, పిల్లలతో సహ 9 మంది అమాయకులు బలి, బెంగళూరు వెలుతుంటే, 14 మందికి !
బెంగళూరు/ తుమకూరు: వేగంగా వెలుతున్న లారీ, టెంపో ట్రాక్స్ ఢీకొనడంతో 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇద్దరు పిల్లలతో సహ 9 మంది చనిపోవడంతో మరో 14 మందికి తీవ్రగాయాలైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయాలైన వారితో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. లారీ డైవర్, టెంపో ట్రాక్స్ డ్రైవర్ నిర్లక్షంగా వాహనాలు నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు.

బెంగళూరులో కూలీ పనులు
కర్ణాటకలోని రాయచూరు, సింధనూరు, లింగసనూరు, దేవదుర్గ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు బెంగళూరులో కూలిపనులు చేస్తున్నారు. ఇటీవల మోహరం పండుగ సందర్బంగా బెంగళూరులో పనులు ఆగిపోవడంతో కూలీలు రాయచూరుతో సహ పరిసర ప్రాంతాల్లోని సొంత ఊర్లకు వెళ్లిపోయారు.

వేకువ జామున నిద్ర సమయంలో ?
బుధవారం రాత్రి మళ్లీ సొంత ఊర్ల నుంచి టెంపో ట్రాక్స్ వాహనంలో బెంగళూరుకు బయలుదేరారు. మార్గం మద్యలో తుమకూరు జిల్లాలోని శిరా తాలుకాలోని కళ్లంబెళ్ల సమీపంలోని బాలేనహళ్లి గేట్ సమీపంలో గురువారం వేకువ జామున వేగంగా వెలుతున్న లారీ కూలీలు ప్రయాణిస్తున్న టెంపోట్రాక్ ను ఢీకొనింది.

డ్రైవర్ల నిర్లక్షం.... 9 మంది కూలీలు బలి
ఈ ప్రమాదంలో టెంపో ట్రాక్స్ డ్రైవర్ క్రిష్ణప్ప, సుజాత, వినోద్ అనే బాలుడు, లక్ష్మీతో సహ 9 మంది చనిపోయారు. 14 మందికి తీవ్రగాయాలు కావడంతో శిరా, తుమకూరు జిల్లా ఆసుపత్రులకు తరలించారు.. వారిలో కొందరిని పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారని ోలీసులు అన్నారు.

డ్రైవర్లు చేసిన తప్పుకు అమాయకులు బలి
ఈ ప్రమాదంలో గాయాలై బాలరాజు, సందీప్, ఉమేష్, యల్లమ్మ, అనీల్, దేవరాజ్, మౌనిక, నాగప్ప, వసంత్, వీరభద్ర, లతా, దుర్గమ్మ తదితరులకు తీవ్రగాయాలైనాయని పోలీసు అధికారులు అంటున్నారు. లారీ డైవర్, టెంపో ట్రాక్స్ డ్రైవర్ నిర్లక్షంగా వాహనాలు నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications