loan app: రూ. 20 వేలు లోన్ ఇచ్చి రూ. 16 లక్షలు లాగేశారు. క్లైమాక్స్ లో యువతి మార్ఫింగ్ ఫోటోలతో ?

చెన్నై/తంజావూరు: ఆన్ లైన్ లోన్లు ఎంత ప్రమాదకరమో అనే విషయం మరోసారి వెలుగు చూసింది. యువతి ప్రైవేట్ బ్యాంక్ పేరుతో ఉన్న యాప్ లో లోన్ తీసుకుంది. లోన్ తీసుకునే సమయంలో ఆ యువతి ఆధార్ కార్డు. ఓటర్ ఐడీ, ఫోటోలు ఆ యాప్ నిర్వహకులకు పంపించింది. విద్యావంతురాలైన యువతి ఇచ్చిన గడువులోపు రుణం మొత్తం చెల్లించింది. కొంతకాలం తరువాత యువతి మొబైల్ ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. మేము చెప్పినంత డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చెయ్యకపోతే నీ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. అప్పటికే పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఆ యువతి హడలిపోయి రూ. 16 లక్షలకు పైగా నిందితుల అకౌంట్ లో జమ చేసింది. తరువాత ఆమె మొబైల్ ఫోన్ కు వచ్చిన కొన్ని ఫోటోలు చూసిన యువతి బిత్తరపోయింది.

 ప్రైవేట్ బ్యాంక్ పేరుతో యాప్

ప్రైవేట్ బ్యాంక్ పేరుతో యాప్

తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని తిరువయ్యార్ ప్రాంతంలో 28 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. బాగా చదువుకున్న యువతికి ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆన్ లైన్ లో లోన్ తీసుకోవాలని ఆ యువతి అనుకుంది. యువతి ప్రైవేట్ బ్యాంక్ పేరుతో ఉన్న యాప్ లో రూ. 20 వేలు లోన్ తీసుకోవాలని అనుకుంది.

 ఒక్క మెసేజ్ తో ?

ఒక్క మెసేజ్ తో ?

యువతి లోన్ తీసుకునే సమయంలో ఆమె ఆధార్ కార్డు. ఓటర్ ఐడీ, ఫోటోలు ఆ యాప్ నిర్వహకులకు పంపించింది. తరువాత ఆ యువతికి రూ. 20 లోన్ మంజూరు అయ్యింది. విద్యావంతురాలైన యువతి ఇచ్చిన గడువులోపు అసలు రూ. 20 వేలతో పాటు వడ్డీతో సహ రుణం మొత్తం చెల్లించింది. కొంతకాలం తరువాత యువతి మొబైల్ ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది.

 పరువు పోతుందని భయపడిన తల్లీ, కూతురు

పరువు పోతుందని భయపడిన తల్లీ, కూతురు

మేము చెప్పినంత డబ్బులు మా బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చెయ్యకపోతే నీ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని నిందితులు బెదిరించారు. తాను మోసపోయానని, ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదని ఆ యువతి ఆమె తల్లికి అసలు విషయం చెప్పింది. డబ్బు కంటే మనకు పరువు ముఖ్యం అని తల్లీ ఆమె కూతురికి చెప్పింది.

 యువతి భయపడిందని ఏం చేశారంటే ?

యువతి భయపడిందని ఏం చేశారంటే ?

అప్పటికే పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఆ యువతి హడలిపోయింది. నిందితులు చెప్పిన బ్యాంక్ అకౌంట్ లకు రూ. 16 లక్షల 31 వేల రూపాయలు జమ చేసింది. యువతి భయపడిపోయిందని, ఇంకా డబ్బులు లాగాలని నిందితులు స్కెచ్ వేశారు. తరువాత కూడా నిందితులు యువతిని డబ్బులు డిపాజిట్ చెయ్యాలని టార్చర్ పెట్టారు.

 మార్ఫింగ్ ఫోటోలతో హడలిపోయింది

మార్ఫింగ్ ఫోటోలతో హడలిపోయింది

తాను ఇంక డబ్బులు డిపాజిట్ చెయ్యలేనని యువతి చెప్పింది. నిందితులు యువతి ఫోటోలు నగ్నంగా మార్ఫింగ్ చేసి ఆమె మొబైల్ ఫోన్ కు పంపించారు, తన మార్ఫింగ్ ఫోటోలు చూసిన యువతి హడలిపోయింది. ఇక లాభం లేదని ధైర్యం చేసిన యువతి తంజావూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంక్ అకౌంట్ నెంబర్ల ఆధారంగా మోసగాళ్ల కోసం గాలిస్తున్నారు. నిందితులు కొన్నిసార్లు తెలుగులో కూడా మాట్లాడారని యువతి పోలీసులకు సమాచారం ఇచ్చిందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+