Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady doctor: మగాడు కాదని చెప్పిన మరదలు, సుత్తి, కత్తెరతో ?, రజనీకాంత్ కోడలు స్వప్నా !

వారణాసి/చెన్నై: ప్రఖ్యాత క్యాన్సర్ డాక్టర్, మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. నువ్వు నపుంసకుడు, సంసారానికి పనికిరావు, నువ్వు మగాడు కాదు అంటూ మహిళా డాక్టర్ పెద్దగా నవ్వుతూ ఆమె బావను హేళన చేసిందని ఆరోపణలు ఉన్నాయి. మరదలు పదేపదే నన్ను నపుంసకుడు, మగాడుకాదని హేళన చేసిందని, తాను సంసారానికి పనికిరాను అంటూ ఎద్దేవ చేసిందని, అందుకే ఆమెను చంపేశానని బావ పోలీసులకు చెప్పడం కలకలం రేపింది. గతంలో కూడా భర్తను నపుంసకుడు అంటూ తన మరదలు పదేపదే టార్చర్ పెట్టిందని, అందుకే ఆమెను చంపేశానని బావ పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.

 మాజీ ఎమ్మెల్యే కోడలు, ఫేమస్ డాక్టర్

మాజీ ఎమ్మెల్యే కోడలు, ఫేమస్ డాక్టర్

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నగరంలోని మహమూర్ గంజ్ ప్రాంతంలో స్వప్నా దత్తా అనే మహిళ నివాసం ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలు అయిన స్వప్నా దత్తా క్యాన్సర్ వ్యాధి నిపుణురాలిగా స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతో మందిని క్యాన్సర్ వ్యాధి నుంచి కాపాడిన స్వప్నా దత్తాకు స్థానికంగా మంచిపేరు ఉంది.

 నువ్వు మగాడు కాదు.... నీకుకూడా తెలుసు కదా ?

నువ్వు మగాడు కాదు.... నీకుకూడా తెలుసు కదా ?

స్వప్నా దత్తాకు అనీల్ దత్తా అనే బావ ఉన్నాడు. బావ అనీల్ దత్తాను డాక్టర్ స్వప్నా దత్తా హేళనగా మాట్లాడేదని ఆరోపణలు ఉన్నాయి. నువ్వు నపుంసకుడు, నువ్వు సంసారానికి పనికిరావు, ఆ విషయం నీకుకూడా తెలుసు కదా ? అంటూ లేడీ డాక్టర్ స్వప్నా దత్తా ఆమె బావను చాలా చులకనగా, అసభ్యంగా మాట్లాడిందని ఆరోపణలు ఉన్నాయి.

 దీనికైనా పనికొస్తానా ?

దీనికైనా పనికొస్తానా ?

మరదలు స్వప్నా దత్తా పదేపదే తనను చులకనగా మాట్లాడటంతో ఆమె బావ అనీల్ దత్తా రగిలిపోయాడు. కోపంతో ఊగిపోయిన అనీల్ దత్తా సుత్తితో మరదలు స్వప్నా దత్తాను కొట్టి కత్తెరతో పొడిచేశాడు. నేను మగాడుకాదు కదా, అయితే నిన్ను చంపడానికి పనికి వస్తాకదా ? అంటూ స్వప్నా దత్తాను దారుణంగా చంపేశాడు.

 నేరం ఒప్పుకున్న బావ

నేరం ఒప్పుకున్న బావ

లేడీ డాక్టర్ స్వప్నా దత్తా హత్యకు గురైన విషయం తెలుసుకున్న వారణాసి పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. తన మరదలు స్వప్నా దత్తాను తానే హత్య చేశానని ఆమె బావ అనీల్ దత్తా నేరం అంగీకరించాడని పోలీసులు అన్నారు. ఇదే సమయంలో అనీల్ దత్తా విడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది.

మొగుడిని స్వప్నా టార్చర్ పెట్టింది

మొగుడిని స్వప్నా టార్చర్ పెట్టింది

అనీల్ దత్తా విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ గతంలో కూడా తన సోదరుడిని స్వప్నా దత్తా నువ్వు నపుంసకుడు అంటూ టార్చర్ పెట్టిందని, ఇప్పుడు నన్ను కూడా నపుంసకుడు అంటూ ఎద్దేవ చేసిందని, నన్ను చూసి నువ్వు మగాడు కాదు అంటూ గట్టిగా నవ్వడంతో కోపం తట్టుకోలేక సుత్తితో కొట్టి కత్తెరెతో పొడిచి చంపేశానని అనీల్ దత్తా వీడియోలు చెప్పాడు.

 బావతో ఏంమాట్లాడాలో తెలీదా ?

బావతో ఏంమాట్లాడాలో తెలీదా ?

తాను తల్లిదండ్రులను చూడటానికి వెలుతున్న సమయంలో స్వప్నా దత్తా తనను టార్చర్ చేసిందని, ఒక బావతో మాట్లాడకూడని మాటలు మాట్లాడిందని, బావతో ఎలా మాట్లాడాలో ఆమెకు తెలీదా ? అందుకే చంపేశానని అనీల్ దత్తా చెప్పాడని పోలీసులు అంటున్నారు. ప్రముఖ లేడీ డాక్టర్, మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలు స్వప్నా దత్తా ఆమె బావ చేతిలో దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+