lady doctor: దంపతులు ఇద్దరూ డాక్టర్లు, లేడీ డాక్టర్ మీద భర్తకు డౌట్, చంపేసి శవం సూట్ కేసులో పెట్టి !

లక్నో: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులు ఇద్దరూ డాక్టర్లు కావడంతో సొంతంగా క్లీనిక్ ప్రారంభించి డబ్బులు బాగా సంపాధిస్తున్నారు. కొంతకాలం నుంచి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి, దంపతులు ఇద్దరూ డాక్టర్లు కావడంతో ఎవ్వరూ కొంచెం కూడా వెనక్కి తగ్గలేదని తెలిసింది. ఇదే సందర్బంలో లేడీ డాక్టర్ మాయం అయ్యింది. లేడీ డాక్టర్ తండ్రి తన కూతురు కనపడటం లేదని మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. లేడీ డాక్టర్ ను ఆమె భర్త, మామ కలిసి హత్య చేసి వందల కిలోమీటర్ల దూరానికి శవాన్ని తీసుకెళ్లి పూడ్చేశారని వెలుగు చూడటంతో లేడీ డాక్టర్ కుటుంబ సభ్యులు, స్థానికులు హడలిపోయారు.

దంపతులు డాక్టర్లు

దంపతులు డాక్టర్లు

ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో అభిషేక్ అవస్తి అలియాస్ అభిషేక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం వందనా అనే యువతిని అభిషేక్ వివాహం చేసుకున్నాడు. అభిషేక్ వైద్యుడు. వందనా కూడా ఆయుర్విక్ డాక్టర్, అభిషేక్, వందనా దంపతులు ఇద్దరూ వైద్యులు కావడంతో సంతోషంగా జీవించారు.

సొంతంగా క్లీనిక్

సొంతంగా క్లీనిక్

అభిషేక్, వందనా దంపతులు ఇద్దరూ డాక్టర్లు కావడంతో సొంతంగా క్లీనిక్ ప్రారంభించి డబ్బులు బాగా సంపాధిస్తున్నారు. భార్య వందనా మీద ఆమె భర్త డాక్టర్ అభిషేక్ కు అనుమానం మొదలైయ్యింది. కొంతకాలం నుంచి అభిషేక్, వందనా దంపతుల మద్య ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి,

 లేడీ డాక్టర్ ను చంపేసిన భర్త

లేడీ డాక్టర్ ను చంపేసిన భర్త

ఇంట్లో అభిషేక్ అతని భార్య వందనాతో గొడవపడ్డాడు. ఆ సందర్బంలో అభిషేక్ అతని తండ్రి గౌరీ శంకర్ తో కలిసి రాడ్ తీసుకుని లేడీ డాక్టర్ వందనా మీద దాడి చేశారు. తీవ్రగాయాలైన డాక్టర్ వందనా కుప్పకూలిపోయింది. తరువాత వందనా చనిపోయింది. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసిన డాక్టర్ అభిషేక్ అంబులెన్స్ ను ఇంటి దగ్గరకు పిలిపించుకున్నాడు.

400 కిలో మీటర్ల దూరంలో శవం పూడ్చేసిన భర్త

400 కిలో మీటర్ల దూరంలో శవం పూడ్చేసిన భర్త

అంబులెన్స్ ఇంటి దగ్గరకు వచ్చిన తరువాత డాక్టర్ అభిషేక్ అతని భార్య వందనా శవాన్ని సూట్ కేసులో పెట్టి అంబులెన్స్ లో పెట్టాడు. తరువాత లఖింపూర్ ఖేరికి 400 కిలోమీటర్ల దూరంలోని నిర్జనప్రదేశంలోకి వెళ్లాడు. మహిళ అంబులెన్స్ లో చనిపోయిందని డ్రైవర్ కు చెప్పిన అభిషేక్ అతని భార్య వందనా శవాన్ని అక్కడే పూడ్చేసి ఇంటికి వెళ్లిపోయాడు.

 మిస్సింగ్ కేసుతో సీన్ రివర్స్

మిస్సింగ్ కేసుతో సీన్ రివర్స్

తన భార్య డాక్టర్ వందనా కనపడటంలేదని అభిషేక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లేడీ డాక్టర్ తండ్రి తన కూతురు కనపడటం లేదని మిస్సింగ్ కేసు పెట్టి అతని అల్లుడు అభిషేక్ మీద అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల అభిషేక్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. లేడీ డాక్టర్ వందనాను ఆమె భర్త, మామ గౌరీ శంకర్ కలిసి హత్య చేసి 400 కిలోమీటర్ల దూరానికి శవాన్ని తీసుకెళ్లి పూడ్చేశారని వెలుగు చూడటంతో లేడీ డాక్టర్ కుటుంబ సభ్యులు, స్థానికులు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+