Wife: భర్త ఫ్రెండ్ తో భార్య అక్రమ సంబంధం, భర్తకు నైట్ డ్యూటీ, అర్దరాత్రి ప్రియుడు ?
చెన్నై/తిరువళ్లూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులు ఇద్దరు పొట్టకూటి కోసం వేరే రాస్ట్రానికి వెళ్లారు. దంపతులు ఇద్దరు కొంతకాలం ఉద్యోగాలు చేశారు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భర్తకు మరో యువకుడితో పరిచయం అయ్యింది. ఒకే చోట పని చేస్తున్న యువకుడు స్నేహితుడి ఇంటికి వెళ్లి వస్తూ అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. రాత్రి భర్త నైట్ డ్యూటీకి వెళ్లాడు. భార్య ఆమె ఇద్దరు పిల్లలను ఎత్తుకుని రాత్రి ప్రియుడికి ఇంటికి వెళ్లింది. రొమాన్స్ చేస్తున్న సమయంలో పిల్లలు ఏడ్చారు. ఆ సందర్బంలో ప్రియుడు అతని ప్రియురాలి ఇద్దరు పిల్లల నోటికి ప్లాస్టర్ వేసి వారి తలలు నేలకు వేసి కొట్టి చంపేశాడు. అడ్డుపడిన ప్రియురాలిని కొడవలితో నరికేయడం కలకలం రేపింది.

ఇంజనీరింగ్ సంస్థలో పని
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని జగన్నాథపురం చత్రం సమీపంలో తేజు అనే ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ ఉంది. బీహార్‌కు చెందిన కుషాల్ (29) అనే యువకుడు, అసోంకు చెందిన ద్వారక అనే యువకుడు అక్కడే పని చేస్తున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన చాలా మంది అదే ఇంజనీరింగ్ సంస్థలో పని చేస్తున్నారు. ద్వారక, కుషాల్ ఒకే కంపెనీలో పని చేయడంతో స్నేహితులయ్యారు.

భార్య, పిల్లలు
ద్వారరక అతని భార్య సుమిత, కుమారుడు శివ (4), కుమార్తె రీమా (1)తో కలిసి కంపెనీ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆ సందర్భంలో ద్వారక ఇంటికి వచ్చి వెలుతున్న కుషాల్ అతని భార్య సుమితతో పరిచయం పెంచుకున్నాడు. కుషాల్, సుమిత తరచుగా ఏకాంతంగా కలుసుకోవడం మొదలుపెట్టి తరువాత అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ప్రతిరోజు సుమిత, కుషాల్ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు.

రాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లింది
రాత్రి భర్త ద్వారక నైట్ డ్యూటీకి వెళ్లడంతో అతని భార్య సుమిత ఇంట్లోనే ఉంది. తరువాత సుమిత ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ప్రియుడు కుషాల్ ఇంటికి వెళ్లింది. అక్కడ సుమిత, కుషాల్ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో పిల్లలు ఏడ్చారని తెలిసింది. తరువాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన కుషాల్ ప్రియురాలు పిల్లలు శివ, రీమాల నోటిపై ప్లాస్టిక్ టేప్ వేసి, వారి తలలు నేలకు కొట్టి దారుణంగా హత్య చేశాడు.

ప్రియురాలు చనిపోయిందని ?
పిల్లల మీద దాడి చేసే సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రియురాలు సుమిత తలపై కొడవలితో దాడి చేసి ఆమె గొంతు కోసిన కుషాల్ కోపం చల్లార్చుకున్నాడు. సుమిత స్పృహతప్పి పడిపోగా ఆమె చనిపోయిందని భావించిన కుషాల్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న చోళవరం పోలీసులు ఇద్దరు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అక్రమ సంబంధంతో ఇద్దరి ప్రాణం పోయింది
అపస్మారక స్థితిలో ఉన్న సుమిత పడియానల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు అన్నారు. ఇద్దరు చిన్నారులను హత్య చేసి పరారీలో ఉన్న కుషాల్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసిన పోలీసులు చెన్నై తోపాటు తమిళనాడు నుంచి బీహార్ వెళ్లే రైళ్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమ సంబంధం గొడవల కారణంగా ఏడాది పాప సహా ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications