Lady leader: లీడర్ రేఖాను వదిన, అనుచరులే చంపేశారు, 780 పేజీల చార్జ్ షీట్, ఫ్రెండ్స్ తో డీల్ !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేషన్ అలియాస్ రేఖాను ఆమె కుటంబ సభ్యులు, నమ్ముకున్న అనుచరులే హత్య చేశారని పోలీసులు నిర్దారించారు. పట్టపగలు చుట్టుపక్కల వాళ్లు చూస్తున్న సమయంలోనే మాజీ కార్పోరేటర్, అధికార బీజేపీ పార్టీకి చెందిన రేఖా కదిరేషన్ హత్యకు గురైయ్యింది. తనకు రక్షణ కల్పిస్తాడని వెంటపెట్టుకున్న బాడీగార్డు, అతని అనుచరులు కలిసి రేఖా కుటుంబ సభ్యులతో కుమ్మక్కు అయ్యి ఆమెను దారుణంగా నరికి చంపేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రేఖా హత్య కేసులో 8 మంది మీద కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు 780 పేజీల చార్జ్ షీటు తయారు చేశారని విశ్వసనీయ సమాచారం. రాజకీయ ప్రత్యర్థులు కాకుండా నమ్ముకున్న వాళ్లు, కుటుంబ సభ్యులు, రోజు వెంటఉండే వాళ్లు రేఖా కదిరేషన్ ను దారుణంగా హత్య చేశారని వెలుగు చూడటంతో ఆమె అనుచరులు హడలిపోయారు. గతంలో రేఖా భర్త, బీజేపీ నాయకుడు కదిరేషన్ ను ఆయన గుడి ఆవరణంలో ఆయన వెంట ఉన్న అనుచరులే దారుణంగా నరికి చంపేశారు.

మాజీ కార్పోరేటర్
బెంగళూరు నగరంలోని ఛలవాదిపాళ్య వార్డు మాజీ కార్పోరేటర్, బీజేపీ నాయకులురాలు రేఖా కదిరేష్ జూన్ 24వ తేదీన ఉదయం ప్లవర్ గార్డెన్ లోని ఆమె కార్యాలయానికి వెళ్లింది. తరువాత కార్యాయంలో శుభ్రం చేసే వ్యక్తి వెళ్లాడు. కార్యాలయం బయట రేఖా కదిరేశన్ బాడీగార్డు ఉన్నాడు. ఉదయం 10. 30 గంటల సమయంలో అక్కా అంటూ బయట నుంచి ఇద్దరు పిలిచారు. రేఖా కదిరేష్ కార్యాలయంలో నుంచి లేచి బయటకు వెళ్లింది.

నడిరోడ్డులో నరికి చంపేశారు
కార్యాలయం నుంచి రేఖా కదిరేష్ బయటకు వచ్చిన వెంటనే అక్కడ ఉన్న ముగ్గురు ఒక్కసారిగా కత్తులతో ఆమెను నరికేశారు. కిందపడిన రేఖా కదిరేష్ గొంతుకోసేశారు. నిమిషంలోనే పనిముగించుకున్న నిందితులు అక్కడి నుంచి పరారైనారు. కిందపడిపోయిన రేఖా గొంతు తెగిపోవడంతో కేకలు వెయ్యలేకపోయింది. విషయం గుర్తించిన స్థానికులు రేఖాను కెంపేగౌడ ఆసుపత్రికి తరలించారు. గొంతు పూర్తిగా తెగిపోవడం, శరీరం మీద కత్తిపోట్లు ఎక్కువ పడడటంతో చికిత్స విఫలమై రేఖా ప్రాణాలు పోయాయి. బెంగళూరులో మాజీ కార్పోరేటర్, కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకురాలు రేఖా కదిరేష్ హత్యకు గురి కావడం అప్పట్లో బెంగళూరులో కలకలం రేపింది.

రేఖా మాజీ రైట్ హ్యాండ్
మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేష్ కు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉండటంతో ఆమె పీటర్ అనే బాడిగార్డును పెట్టుకున్నారు. తరువాత పీటర్ ను రేఖా కదిరేషన్ దూరం పెట్టింది. జూన్ 24వ తేదీ ఉదయం 10.30 గంటల వరకు రేఖా కార్యాలయం బయట ఆమె మాజీ బాడీగార్డు పీటర్ ఉన్నాడు. ఉదయం 10.35 గంటలకే రేఖా కదిరేష్ మీద ముగ్గురు దాడి చేసి నరికేశారని ప్రత్యక్షసాక్షు అప్పట్లో పోలీసులకు చెప్పారు. రేఖాను ఆమె మాజీ బాడీగార్డు పీటర్, అతని బంధువు స్టీఫెన్, అజయ్ హత్య చేశారని అప్పట్లో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

రేఖా భర్త కూడా అదే టైపులో హత్య
ఛలవాదిపాళ్య మాజీ కార్పోరేటర్ రేఖా భర్త కదిరేషన్ కూడా గతంలో ఇలాగే దారుణ హత్యకు గురైనాడు. 2018 ఫిబ్రవరి 7వ తేదీన ప్లవర్ గార్డెన్ లోని ఓ దేవాలయం ఆవరణంలోనే కదిరేషన్ ను శోభన్, స్టీఫెన్ అతని అనుచరులు దారుణంగా నరికి చంపేశారు. కదిరేషన్ హత్య కేసులో జైలుకు వెళ్లిన స్టీఫెన్ ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చాడు. భర్త కదిరేషన్ ను చంపిన స్టీఫెన్ అతని అనుచరులు బీజేపీ నాయకురాలు రేఖాను కూడా దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

రేఖా వదిన మాలా ప్రతీకారం
కదిరేషన్ సోదరి మాలా బీజేపీ నాయకురాలు రేఖా కదిరేషన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు. అప్పట్లో సోదరుడు కదిరేషన్ తో కలిసి మాలా రౌడీయిజం చేసి ఛలవాదిపాళ్య, ఫ్లవర్ గార్డెన్ లో లేడీ ఢాన్ గా గుర్తింపు తెచ్చుకుంది. రేఖా కదిరేషన్ ను వివాహం చేసుకున్న తరువాత కదిరేషన్ ఆమె అక్క మాలాను పెద్దగా పట్టించుకోలేదని, అందుకే మాలా ఆమె ఆడపడుచు రేఖా మీద కక్ష పెంచుకుందని పోలీసు అధికారులు అంటున్నారు.

8 మంది మీద ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్
బీజేపీ నాయకురాలు రేఖా కదిరేషన్ హత్య కేసులో 8 మంది మీద బెంగళూరులో కాటన్ పేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రేఖా ఆడపడుచు మాలా, కదిరేష్ మాజీ రైట్ హ్యాండ్ పీటర్ (46), సూర్యా (20), స్టీఫెన్ (21), పురుషోత్తమ్ (22), అజయ్ (21), అరుణ్ కుమార్ (36), సెల్వరాజ్ అలియాస్ క్యాప్టెన్ (36) అనే నిందితుల మీద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.

రేఖా హత్య కేసులో 780 పేజీల చార్జ్ షీట్ !
బీజేపీ నాయకురాలు రేఖా హత్య కేసులో 8 మంది మీద కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు 780 పేజీల చార్జ్ షీటు తయారు చేశారని విశ్వసనీయ సమాచారం. రాజకీయ ప్రత్యర్థులు కాకుండా నమ్ముకున్న వాళ్లు, కుటుంబ సభ్యులు, రోజు వెంటఉండే వాళ్లు రేఖా కదిరేషన్ ను దారుణంగా హత్య చేశారని వెలుగు చూడటంతో ఆమె అనుచరులు హడలిపోయారు.
Recommended Video

నమ్ముకున్న వాళ్లు, కుటుంబ సభ్యులే కిల్లర్స్
ఐటీ హబ్ బెంగళూరులో మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేషన్ అలియాస్ రేఖాను ఆమె ఆడపడుతు మాలా, భర్త కదిరేషన్ నమ్ముకున్న అనుచరులే ఆమెను హత్య చేశారని పోలీసులు నిర్దారించారు. పట్టపగలు చుట్టుపక్కల వాళ్లు చూస్తున్న సమయంలోనే మాజీ కార్పోరేటర్, అధికార బీజేపీ పార్టీకి చెందిన రేఖా కదిరేషన్ హత్యకు గురైయ్యింది. తనకు రక్షణ కల్పిస్తాడని వెంటపెట్టుకున్న ఒకప్పటి బాడీగార్డు, అతని అనుచరులు కలిసి రేఖా కుటుంబ సభ్యులతో కుమ్మక్కు అయ్యి ఆమెను దారుణంగా నరికి చంపేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications