lady principal: కారు అడ్డగించి మేడమ్ ను కిందకు దింపి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఓల్డ్ స్టూడెంట్ !

కాలేజ్ లో బాగా చదువుకున్న ఓ యువకుడు అదే కాలేజ్ లేడీ ప్రిన్సిపాల్ మీద కక్ష పెంచుకున్నాడు. ఇప్పటికే ఒకసారి హత్యాయత్నం చేసిన ఆ యువకుడు రెండో సారి ఆమె మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు.

భోపాల్/మధ్యప్రదేశ్: కాలేజ్ లో బాగా చదువుకున్న ఓ యువకుడు అదే కాలేజ్ లేడీ ప్రిన్సిపాల్ మీద కక్ష పెంచుకున్నాడు. ఇప్పటికే ఆమె మీద ఒకసారి హత్యాయత్నం చేసిన ఆ యువకుడు చివరికి రెండో సారి ఆమె మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కాలేజ్ లో చదువు పూర్తి చేసినా తనకు మార్కులిస్టు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కాలేజ్ లేడీ ప్రిన్సిపాల్ కు నిప్పంటించాడు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బిఎమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపాల్ విముక్తా శర్మా ( 54) అనే మహిళ సాయంత్రం నాలుగు గంటలకు కాలేజ్ లో పని ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరడానికి సిద్దం అయ్యారు. కళాశాల పూర్వ విద్యార్థి అశుతోష్ శ్రీవాత్సవ (24) కారును అడ్డుకున్నాడు. తరువాత కాలేజ్ ప్రిన్సిపాల్ విముక్తా శర్మాతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో ఆమె మీద పెట్రోల్ పోసి సిగరెట్ లైటర్ తో నిప్పంటించాడు.

Lady: Old student who poured petrol on college lady principal and set her on fire in Madhya Pradesh.

ఈ మంటల్లో లేడీ ప్రిన్సిపాల్ విముక్తా శర్మా కాలిపోయి ఆర్తనాదాలు చేశారు. కేకలు వినిపించడంతో ఆ ప్రాంతంలో ఉన్న వారు కళాశాల సిబ్బంది ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దాదాపు 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన కాలేజ్ ప్రిన్సిపాల్ విముక్తా శర్మా పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అనంతరం ఆత్మహత్యకు యత్నించిన మాజీ విద్యార్థి శ్రీవత్సవాను పోలీసులు అరెస్ట్ చేశారు.

గతేడాది జులైలో చదువు పూర్తి చేశానని, తనకు మార్కుల జాబితా ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం వేధిస్తోందని శ్రీవత్సవా ఆరోపిస్తున్నాడు, ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం మార్కుల పత్రం ఇవ్వడంలో జాప్యం చేయడంతో విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో గతంలో కాలేజీ ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేశాడని, ప్రిన్సిపాల్ మీద దాడి చేసి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడని పోలీులు అన్నారు. బెయిల్ మీద వచ్చిన శ్రీవత్సవ చివరికి లేడీ ప్రిన్సిపాల్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+