Lady police: ఇంకా పెళ్లి కాలేదు, రైలు కింద శవమైన లేడీ పోలీసు, ఏం జరిగింది !

చెన్నై/తిరువణ్ణామలై: పోలీసు శాఖలో మహిళ ఉద్యోగం చేస్తోంది. మహిళకు సోదరులు ఉన్నారు. కొంతకాలం క్రితం మహిళ తల్లి చనిపోయారు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న లేడీ కానీస్టేబుల్ రైలు కిందపడి చనిపోవడం కలకలం రేపింది. పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొనిందని కొందరు. రైలు కింద దూకి లేడీ పోలీసు ఆత్మహత్య చేసుకుందని కొందరు చెబుతున్నారు.

తమిళనాడులోని తిరువాముల్లైవాయల్ ప్రాంతానికి చెందిన శ్రీప్రియ (35) కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరింది. చెన్నై సిటీలోని ఏసీబీలో శ్రీప్రియ ఉద్యోగం చేస్తోంది. చెన్నైలోని పరంగిమలైలోని కార్యాలయానికి రోజు శ్రీప్రియ వెళ్లి వస్తోంది. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీప్రియ ఇంకా పెళ్లి చేసుకోలేదు. శ్రీప్రియ ఆమె ఆమె తల్లితో నివసిస్తోంది. కొన్ని నెలల క్రితం శ్రీప్రియ తల్లి కూడా మరణించారు.

 Lady police who died suspiciously after being hit by a train in Chennai.

శ్రీప్రియ సోదరులు వివాహాలు చేసుకుని వారి సోంత ఊర్లలో నివాసం ఉంటున్నారు. ఇంతకాలం తల్తితో కలిసి నివాసం ఉంటున్న లేడీ పోలీసు శ్రీప్రియ ఇప్పుడు ఒంటరి అయ్యింది. ఉదయం 10 గంటలకు చెన్నైలోని అవడి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై నుంచి రైలును దాటేందుకు ప్రయత్నించిన సమయంలో శ్రీప్రియాను అటు వైపు వేగంగా వచ్చిన జోలార్‌పేట ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని మృతి చెందింది.

దీంతో షాక్‌కు గురైన రైల్వే ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవడి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీప్రియా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొందరు ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్ రైలుపైకి శ్రీప్రియా దూకడం చూసి ఫిర్యాదు చేశారు. అయితే శ్రీప్రియా ఆత్మహత్యకు పాల్పడిందా, ప్రమాదవశాత్తు చనిపోయిందా అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. శ్రీప్రియా ఉద్యోగం చేస్తున్న చోట ఏమైనా పని ఒత్తిడి ఉందడా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని అవడి రైల్వే పోలీులు తెలిపార. లేడీ పోలీసు శ్రీప్రియా రైలు కిందపడి చనిపోవడంతో సాటి పోలీసులు షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+