Lady police: పోలీసు క్వాటర్స్ లో శవమైన యువతి, పక్కనే ప్రియుడు, కిటికీకి వేలాడుతూ, షాక్ !

చెన్నై/కోయంబత్తూరు: పోలీసు ఉద్యోగం చేస్తున్న యువతి మరో పోలీసుతో ప్రేమలో పడింది. ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని ఇంట్లో లేడీ పోలీసు తేల్చి చెప్పింది. నీ జీవితం నీ ఇష్టం అలాగే చెయ్యి అని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఇంతకాలం హ్యాపీగా ప్రియురాలితో ఎంజాయ్ చేసిన పోలీసు అతని బుద్ది చూపించాడని తెలిసింది. పోలీసు క్వాటర్స్ లోని ఇంటి కిటికీకి ఆ లేడీ పోలీసు శవమై కనిపించింది. నేల మీద మోకాళ్ల మీద నలబడి ఉన్న స్థితిలో లేడీ పోలీసు శవమై కనిపించడం, ఆ విషయాన్ని ఆమె ప్రియుడే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం, అంతుకు ముందు లేడీ పోలీసుకు ఆమె ప్రియుడు నాలుగు సార్లు ఫోన్ చెయ్యడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అందమైన యువతికి పోలీసు ఉద్యోగం

అందమైన యువతికి పోలీసు ఉద్యోగం


తమిళనాడులోని మదురై జిల్లా పెరైయూర్ సమీపంలోని కాంచంమాడి ప్రాంతంలో నివాసం ఉంటున్న మహాలక్ష్మి అలియాస్ లక్ష్మీ (25) అనే యువతికి 2018లో పోలీసు ఉద్యోగం వచ్చింది. కోయంబత్తూరు చేరుకున్న మహాలక్ష్మి ఉద్యోగం చేసుకుంటూ కోయంబత్తూరులోని ఉపలిపాళ్యంలోని పోలీసు క్వాటర్స్ లో ఒంటరిగా నివాసం ఉంటోంది.

పోలీసు ప్రియుడు

పోలీసు ప్రియుడు

సాయుధ పోలీసుగా ఉద్యోగం చేస్తున్న మహాలక్ష్మి పోలీసు ఉద్యోగం చేస్తున్న రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువడికి పరిచయం అయ్యింది. తిరునల్వేలికి చెందిన రాజేష్, మహాలక్ష్మి ఒకరికి ఒకరు దగ్గర అయ్యారు. కలిసి ఉంటున్న రాజేష్, మహాలక్ష్మి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిసింది.

ప్రియురాలి ఇంట్లో ప్రియుడు

ప్రియురాలి ఇంట్లో ప్రియుడు

గురువారం రాత్రి రాజేష్ అతని ప్రియురాలు మహాలక్ష్మి మూడు నాలుగు సార్లు ఫోన్ చేశాడని తెలిసింది. ప్రియురాలు ఫోన్ రిసీవ్ చేసుకోలేదని అతను ఆమె నివాసం ఉంటున్న పోలీసు క్వాటర్స్ కు వెళ్లాడు. తాను ఇంటికి వెళ్లి చూసే సమయానికి మహాలక్ష్మి ఇంట్లోని కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని రాజేష్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ

చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ

మహాలక్ష్మి మృతదేహాన్ని కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మహాలక్ష్మి కుటుంబ సభ్యులు కోయంబత్తూరు చేరుకున్నారు. చిన్నప్పటి నుంచి మహాలక్ష్మికి ధైర్యం ఎక్కువ అని, ఆమెకు పిరికితనం లేదని, అందుకే ఏరికోరి పోలీసు ఉద్యోగంలో చేరిందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

మోకాళ్ల మీద కుర్చుని ఎవరైనా ఉరి వేసుకుంటారా ?

మోకాళ్ల మీద కుర్చుని ఎవరైనా ఉరి వేసుకుంటారా ?


ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే నేల మీద మోకాళ్ల మీద కుర్చుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటారా ? అని మహాలక్ష్మి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మహాలక్ష్మిని ఆమె ప్రియుడితో పెళ్లి చేసుకోవడానికి మేము అందరూ అంగీకరించామని, రాజేష్ కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదని, కనీసం పెళ్లి విషయం మాట్లాడటానికి ముందుకురాలేదని మహాలక్ష్మి కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు.

ప్రియుడే హంతకుడు ?

ప్రియుడే హంతకుడు ?


మహాలక్ష్మిని ఆమె ప్రియుడే చంపేసి కిటికీకి వేలాడిదీసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మహాలక్ష్మి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు తాము ఏమీ చెప్పలేమని కోయంబత్తూరు పోలీసులు అంటున్నారు. పోలీసు క్వాటట్స్ లో లేడీ పోలీసు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం, అదే సమయంలో ఆమె ప్రియుడు అక్కడే ఉండటం పోలీసు శాఖలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+