చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady SI: భర్తను చంపాలని రూ. 10 లక్షలు ఇచ్చిన లేడీ ఎస్ఐ, కారు డ్రైవర్ తో మేడమ్ ?, దృశ్యం సినిమా !

|
Google Oneindia TeluguNews

చెన్నై/క్రిష్ణగిరి: భర్త ఏఎస్ఐగా ఉద్యోగం చేశాడు. భార్య లేడీ ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నది. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. ఇద్దరూ పోలీసు అధికారులు కావడంతో మంచి జీతం తీసుకుంటున్నారు, నేరస్తులతో లింక్ పెట్టుకుని భారీగా లంచాలు తీసుకుంటున్న ఏఎస్ఐని సస్సెండ్ చేశారు. భార్య మాత్రం ఎస్ఐగా ఉద్యోగం చేస్తోంది. సస్పెండ్ అయిన ఏఎస్ఐ కనపడకుండా పోయాడు. ఏఎస్ఐ తల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఏఎస్ఐ హత్యకు గురైనాడని వెలుగు చూసింది. లేడీ ఎస్ఐ ఆమె భర్తను హత్య చెయ్యడానికి రూ. 10 లక్షలు కిరాయి హంతకులకు ఇచ్చిందని వెలుగు చూడటం కలకలం రేపింది. దృశ్యం సినిమా టైప్ లో హత్య జరగడం, అదే టైపులో శవాన్ని మాయం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Wife: రాత్రి లేటుగా వస్తానని ఫోన్ చేసి చెప్పిన మహిళ, ఉదయం రోడ్డుపక్కన శవం ఉందని ఫోన్ !Wife: రాత్రి లేటుగా వస్తానని ఫోన్ చేసి చెప్పిన మహిళ, ఉదయం రోడ్డుపక్కన శవం ఉందని ఫోన్ !

అందరివాడు

అందరివాడు

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఊధంగరై తాలూకాలోని కల్లావిలో సెంథిల్‌కుమార్ (49) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సెంథిల్ కుమార్ ఏఎస్ఐగా పనిచేసేవాడు. సెంథిల్ కుమార్ భార్య చిత్రా సింగారపేట పోలీస్ స్టేషన్‌లో స్పెషల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. నేరస్తులతో లింక్ పెట్టుకుని భారీగా లంచాలు తీసుకుంటున్న ఏఎస్ఐని సస్సెండ్ చేశారు. సెంథిల్ కుమార్ భార్య చిత్రా మాత్రం ఎస్ఐగా ఉద్యోగం చేస్తోంది

మాయం అయిన ఏఎస్ఐ

మాయం అయిన ఏఎస్ఐ

సెంథిల్ కుమార్, చిత్రా దంపతులకు జగదీష్ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. సెంథిల్ కుమామార్, చిత్రా. వీరి కుమారుడు జగదీష్ కుమార్ ఉత్తంగరై గవర్నర్ తోప్ అనే ప్రాంతంలో సొంత ఇంటిలో నివసిస్తున్నారు. సెప్టెంబర్ 16 నుంచి సెంథిల్‌కుమార్ కనిపించకుండా పోయాడు. ఈ విషయమై సెంథిల్‌కుమార్‌ తల్లి కల్లవి క్రిష్ణగిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఫోన్ కాల్స్ తో అనుమానం

ఫోన్ కాల్స్ తో అనుమానం

ఏఎస్ఐ సెంథిల్ కుమార్ చివరి ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వెళ్లింది అని ఆరా తీశారు. ఏఎస్ఐ సెంథిల్ కుమార్ , అతని కుమారుడు జగదీష్ కుమార్ , వీరి కారు డ్రైవర్ కమల్ రాజ్ ముగ్గురి ఫోన్లు ఒకేచోట ఉన్నాయని, తరువాత అందరూ రెండు రోజులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారని వెలుగు చూసింది. పోలీసులకు అనుమానం వచ్చి డిసెంబర్ 13వ తేదీ విచారణకు హాజరుకావాలని ఏఎస్ఐ కుమారుడు జగదీష్ కుమార్, కారు డ్రైవర్ కమల్ రాజ్ కు సూచించారు. అయితే ఇద్దరు మాత్రం పోలీసుల విచారణకు హాజరుకాలేదు.

కోర్టులో లొంగిపోయిన ఏఎస్ఐ కొడుకు

కోర్టులో లొంగిపోయిన ఏఎస్ఐ కొడుకు

సెంథిల్‌కుమార్‌ను హత్య చేసి మృతదేహాన్ని తెన్‌పెన్నా నదిలో పడేశామని డిసెంబర్ 14వ తేదీ ఇద్దరూ కృష్ణగిరి కోర్టులో లొంగిపోయారు. అనంతరం జగదీష్ కుమార్, కమల్ రాజ్ ను పోలీసులు సేలం సెంట్రల్ జైలుకు పంపించారు. ఉత్తంకరై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమలా అద్విన్ హత్యకు సంబంధించి సెంథిల్‌కుమార్ భార్య చిత్రను విచారించారు. అలాగే సెంథిల్‌కుమార్‌ కుమారుడు జగదీష్‌కుమార్‌, కమల్ రాజ్ ను సేలం జైలు నుంచి అదుపులోకి తీసుకుని విచారించారు.

లేడీ ఎస్ఐ విచారణతో షాక్

లేడీ ఎస్ఐ విచారణతో షాక్

సెంథిల్‌కుమార్‌ను హత్య చేసి మృతదేహానికి బండరాయి కట్టి ఉత్తంగరైలోని భారతీపురం ప్రాంతంలోని పాడుపడిన బావిలో పడేశామని నిందితులు అంగీకరించారు. పోలీసులు బావిలో నుంచి సెంథిల్‌కుమార్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని అతని బంధువులకు అప్పగించారు. ఈ స్థితిలో జగదీష్‌కుమార్‌, కమల్‌రాజ్‌లను పోలీసులు విచారించగా సెంథిల్‌కుమల్‌ ను హత్య చెయ్యడానికి అతని భార్య, ఎస్ఐ చిత్రా కిరాయి హంతకులను నియమించిందని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు.

లేడీ ఎస్ఐకి డ్రైవర్ తో అక్రమ సంబంధం

లేడీ ఎస్ఐకి డ్రైవర్ తో అక్రమ సంబంధం

పోలీసులు స్పెషల్ ఎస్ చిత్రా, భవకల్‌కు చెందిన మహిళా మంత్రగత్తె సరోజ, కిరాయి హంతకులు విజయకుమార్, రాజా పాండియన్‌లను అదుపులోకి తీసుకున్నారు. లేడీ ఎస్ఐ చిత్రాను పోలీసులు విచారించగా సెంథిల్ కుమార్ హత్యకు గల కారణాలు మొత్తం బయటకు వచ్చాయి. కారు డ్రైవర్ కమల్ రాజ్ తో లేడీ ఎస్ఐ చిత్రా అక్రమ సంబంధం పెట్టుకుందని, ఈ విషయం తెలిసిన ఏఎస్ఐ సెంథిల్ కుమార్ ఇద్దరిని హెచ్చరించాడని పోలీసులు అన్నారు. ఇదే సందర్బంలో సస్పెండ్ అయిన సెంథిల్ కుమార్ నిత్యం ఇంట్లో ఉండటంతో లేడీ ఎస్ఐ చిత్రా ఆమె ప్రియుడు కమల్ రాజ్ తో ఏకాంతంగా కలవలేకపోయిందని పోలీసులు అన్నారు.

లేడీ ఎస్ఐ ప్రియుడు, కొడుకు, కిరాయి హంతకులు

లేడీ ఎస్ఐ ప్రియుడు, కొడుకు, కిరాయి హంతకులు

తన భర్తకు విషయం తెలిసిపోయిందని భయపడిన లేడీ ఎస్ఐ చిత్రా సెంథిల్‌కుమార్‌ ను హత్య చేయాలని ప్లాన్ వేసింది. లేడీ ఎస్ఐ చిత్రా అప్పటికే పరిచయం ఉన్న భావకల్లికి చెందిన మహిళా మంత్రగత్తె సరోజ ద్వారా కిరాయి హంతకులను సంప్రధించింది. భర్త సెంథిల్ కుమార్ హత్యకు అతని భార్య, లేడీ ఎస్ఐ చిత్రా రూ. 9 లక్షల 60 వేల రూపాయలు ఇచ్చింది. మొత్తం రూ. 10 లక్షలకు డీల్ మాట్లాడుకున్నారు. సెంథిల్ కుమార్ ను అతని కుమారుడు జగదీష్‌కుమార్‌, కారు డ్రైవర్‌ కమల్‌రాజ్‌, కిరాయి హంతకులు కలిసి సెంథిల్‌కుమార్‌ను అతని ఇంట్లోనే దారుణంగా కొట్టి చంపారు.

దృశ్యం సినిమా టైప్ లో హత్య

దృశ్యం సినిమా టైప్ లో హత్య

పోలీసుల దృష్టి మరల్చేందుకే సెంథిల్‌కుమార్ మృతదేహాన్ని దృశ్యం సినిమా టైప్ లో పాడుపడిన బావిలో పడేశామని నిందితులు అంగీకరించారని పోలీసులు అన్నారు. దృశ్యం సినిమా టైప్ లో హత్య ఒక్క ఆధారం కూడా దొరక్కుండా చేయాలని లేడీ ఎస్ఐ చిత్రా ప్లాన్ చేసిందని పోలీసు అధికారులు అంటున్నారు. హత్యకు గురైన భర్త సెంథిల్ కుమార్ మృతదేహం దొరకకపోతే కేసు నుంచి తప్పించుకోవాలని చిత్రా కూడా ప్లాన్ చేసింది. సెంథిల్ కుమార్ మృతదేహం బయటకు రాకుండా బండరాయి కట్టి బావిలో వేశారని పోలీసులు అన్నారు. కిరాయి హంతకులు రాజపాండి, విజయకుమార్‌లను అరెస్టు చేశామని పరారీలో ఉన్న ఇద్దరు కిరాయి హంతకులు వెల్లిస్వామి, సెంగొట్టియన్ ల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Lady SI who gave 10 lakhs to hired killers to kill her husband near Krishnagiri in Tamil Nadu. Lady SI who had illicit relationship with car driver.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X