Wife: మొగుడు అమాయకుడు, కంత్రీ పెళ్లానికి కన్నింగ్ ప్రియుడు, షీలా డ్రామాకు క్లైమాక్స్, స్కెచ్ తో !
బెంగళూరు/ హావేరి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. దంపతులు నివాసం ఉంటున్న ఊరిలోనే మరో యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు నెలల క్రితం భర్త మాయం అయ్యాడు. భర్త కనపడకపోవడంతో అతని కుటుంబ సభ్యులు భార్యను అడిగారు. తన భర్త సిటీలో పని చెయ్యడానికి వెళ్లాడని చెప్పిన భార్య సైలెంట్ గా ఉండిపోయింది. అటవి ప్రాంతంలో టైర్లు, పెట్రోల్ పోసి ఓ వ్యక్తికి నిప్పంటి కాల్చి బూడిద చేసిన విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు నెలల వరకు హత్యకు గురైన వ్యక్తి వివరాలు ఏమాత్రం పోలీసులకు చిక్కలేదు. జిల్లాలో, పక్క జిల్లాల్లో మిస్సింగ్ కేసుల గురించి పోలీసులు ఆరా తీశారు. అయినా పోలీసులకు చిన్న క్లూ కూడా చిక్కలేదు. అయితే ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

35 ఏళ్ల వ్యక్తి శవం
కర్ణాటకలోని హావేరి జిల్లాలోని శిగ్లావి తాలుకాలోని డవి సోమాపుర అటవి ప్రాంతంలో టైర్లు, పెట్రోల్ పోసి ఓ వ్యక్తికి నిప్పంటి కాల్చి బూడిద చేసిన విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు నెలల వరకు హత్యకు గురైన 35 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి వివరాలు ఏమాత్రం పోలీసులకు చిక్కలేదు.

సైలెంట్ గా ఉండిపోయిన భార్య
జిల్లాలో, పక్క జిల్లాల్లో మిస్సింగ్ కేసుల గురించి పోలీసులు ఆరా తీశారు. అయినా పోలీసులకు చిన్న క్లూ కూడా చిక్కలేదు. అయితే లక్షేశ్వర్ తాలుకాలోని సువర్ణగిరి తాండాలో నివాసం ఉంటున్న మాలిక్ పార్వత్ గౌడ పాటిల్ అలియాస్ పార్వత్ గౌడ కనపడటం లేదని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పార్వత్ గౌడ భార్య షీలా మాత్రం పోలీసు కేసు పెట్టకుండా సైలెంట్ గా ఉందని పోలీసులు తెలుసుకున్నారు.

ప్రియుడి మోజులో షీలా
పార్వత్ గౌడ్ భార్య ఆమె నివాసం ఉంటున్న గ్రామంలోనే నివాసం ఉంటున్న శంకరప్ప అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని పోలీసులు తెలుసుకున్నారు. భార్య షీలా అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఆమె భర్త పార్వత్ గౌడ్ భార్యతో పాటు ఆమె ప్రియుడు శంకరప్పకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారని పోలీసులు తెలుసుకున్నారు.

మూడు నెలల క్రితమే చంపేశారు
భర్త పార్వత్ గౌడ బతికిఉంటే తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతా ఉంటాని అనుకున్న షీలా ఆమె ప్రియుడు శంకరప్పతో కలిసి చంపేయాలని డిసైడ్ అయ్యింది. ఆగస్లు 25వ తేదీన భర్త పార్వత్ గౌడను నమ్మించి పిలుచుకుని వెళ్లింది. తరువాత ప్రియుడు శంకరప్పతో కలసి షీలా ఆమె భర్త పార్వత్ గౌడను చంపేసింది.

డ్రామాలు అడింది..... అడ్డంగా చిక్కిపోయింది
పార్వత్ గౌడను హత్య చేసిన తరువాత సురేష్, గోదప్ప, రామన్న, నాగప్ప, చెన్న బసవప్ప సహాయంతో అతని శవాన్ని శిగ్లావి తాలుకాలోని డవి సోమాపుర అటవి ప్రాంతంలోకి తీసుకెళ్లి టైర్లు, పెట్రోల్ పోసి నిప్పంటి కాల్చి బూడిద చేశారు. పార్వత్ గౌడ కనపడకపోవడంతో అతని కుటుంబ సభ్యులు షీలాను అడిగారు. తన భర్త పార్వత్ గౌడ ముంబాయిలో పని చెయ్యడానికి వెళ్లాడని చెప్పిన షీలా సైలెంట్ గా ఉండిపోయిందని పోలీసులు అన్నారు.

ప్రియుడి మోజులో పడి భర్తనే ?
షీలా, ఆమె ప్రియుడు శంకరప్ప, శవాన్ని కాల్చి బూడిద చెయ్యడానికి సహాయం చేసిన సురేష్, గోదప్ప, రామన్న, నాగప్ప, చెన్న బసవప్పను అరెస్టు చేశామని హావేరి జిల్లా ఎస్పీ హనుమంతప్ప మీడియాకు చెప్పారు. ప్రియుడి మోజులో పడిన షీలా ఆమె భర్త పార్వత్ గౌడను దారుణంగా హత్య చేసి శవాన్ని కాల్చి బూడిద చేసిందని వెలుగు చూడటం హావేరీలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications