Lady: ఒంటరిగా వడ్డీ వ్యాపారం చేస్తున్న మహిళ, ఇట్లో దూరి రివాల్వర్ తో కాల్చిపారేశారు, రూ, కోట్ల ఆస్తితో !
బెంగళూరు/బెళగావి: భర్తకు దూరం అయిన మహిళ ఒంటరిగా నివాసం ఉంటున్నది. మహిళకు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఒంటరిగా ఉంటున్న మహిళ వడ్డీ వ్యాపారం చేస్తున్నది. అవసరం ఉన్న వాళ్లు, తెలిసిన వాళ్లు ఆమె దగ్గర భారీ మొత్తంలో వడ్డీకి డబ్బులు తీసుకున్నారు. కొందరు ప్రతినెల వడ్డీ డబ్బులు ఇవ్వడానికి ఆమె ఇంటికి వచ్చి వెలుతున్నారు. కొన్నిసార్లు ఆమె వడ్డీ డబ్బులు వసూలు చెయ్యడానికి వారి దగ్గరకు వెళ్లి వస్తోంది. రాత్రి ఇంట్లో ఆమె భోజనం చేసి టీవీ చూస్తోంది. ఆసమయంలో ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు రివాల్వర్ తీసుకుని ఆమె మీద కాల్పులు జరిపారు. రివాల్వర్ లోని తూటాలు దూసుకోవడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒంటరిగా ఉంటూ వడ్డీ వ్యాపారం చేస్తున్న మహిళను రివాల్వర్ తో కాల్చి చంపడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. తెలిసిన వాళ్లు మహిళను దారుణంగా హత్య చేపి ఉంటారని పోలీసులు అంటున్నారు.
Illegal affair: తండ్రి దినాల రోజు తల్లి లవ్ స్టోరీ చెప్పిన కొడుకు, ఆ రోజు రాత్రి మమ్మీ, అంకుల్!

వడ్డీ వ్యాపారం చేస్తున్న లేడీ
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని హుక్కేరి తాలుకాలోని సంకేశ్వర ప్రాంతంలో శైలజా నిరంజన్ అలియాస్ శైలా (56) అనే మహిళ నివాసం ఉంటున్నది. భర్తకు దూరం అయిన శైలా నిరంజన్ సంకేశ్వరలోని ఆమె ఇంటిలో ఒంటరిగా నివాసం ఉంటున్నది. శైలా నిరంజన్ కు రూ. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా ఉంటున్న శైలా నిరంజన్ వడ్డీ వ్యాపారం చేస్తున్నది.

వడ్డీ డబ్బుల కోసం మహిళ ఇంటికి రాకపోకలు
అవసరం ఉన్న వాళ్లు, తెలిసిన వాళ్లు శైలా నిరంజన్ దగ్గర భారీ మొత్తంలో వడ్డీకి డబ్బులు తీసుకున్నారు. కొందరు ప్రతినెల వడ్డీ డబ్బులు ఇవ్వడానికి శైలా నిరంజన్ ఇంటికి వచ్చి వెలుతున్నారు. కొన్నిసార్లు వడ్డీ డబ్బులు వసూలు చెయ్యడానికి శైలా నిరంజన్ వడ్డీకి డబ్బలు తీసుకున్న వారి దగ్గరకు వెళ్లి వస్తోంది.

రివాల్వర్ తో కాల్చిపారేసిన నిందితులు
రాత్రి ఇంట్లో శైలా నిరంజన్ భోజనం చేసి టీవీ చూస్తోంది. ఆసమయంలో ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు రివాల్వర్ తీసుకుని శైలా నిరంజన్ మీద కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్లు శైలా నిరంజన్ ఛాతీలో, మరో బుల్లెట్ ఆమె భుజం మీద దూసుకుపోయాయి. రివాల్వర్ లోని తూటాలు దూసుకోవడంతో శైలా నిరంజన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఆర్థిక లావాదేవీలు, ఆస్తి కోసం హత్య
విషయం తెలుసుకున్న శైలా నిరంజన్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె ఇంటికి చేరుకున్నారు. కంట్రీమేడ్ రివాల్వర్ తో శైలా నిరంజన్ ను కాల్చి చంపేశారని పోలీసులు అంటున్నారు. ఆర్థిక లావాదేవీలు, ఆస్తి కోసం శైలా నిరంజన్ ను హత్య చేసి ఉంటారని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. శైలా నిరంజన్ దగ్గర భారీ మొత్తంలో ఎవరెవరు వడ్డీకి డబ్బులు తీసుకున్నారు ?, ఆమె ఆస్తుల మీద ఎవరెవరు కన్ను వేశారు ? అంటూ ఆరా తీస్తున్నామని బెళగావి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.