
Lady: ఫేస్ బుక్ లవర్స్, అమ్మాయి కాదు, పిల్లల తల్లి, రెచ్చిపోయిన లేడీ, ప్రియుడి మీద యాసిడ్ పోసి!
తిరువనంతపురం/కొచ్చి: సోషల్ మీడియాలో పరిచయాలు చాలా మంది జీవితాలు నాశనం చేస్తున్నాయని అనేకసార్లు వెలుగు చూశాయి. ముక్కు ముఖం తెలియ వారితో సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుంటే సినిమా కష్టాలు ఎదురౌతాయని తెలిసినా చాలా మంది వాటిన బారినపడి లబోదిబో అంటున్నారు. ఫేస్ బుక్ లో ఓ యువకుడితో మహిళకు పరిచయం ఏర్పడింది. మొదట హలో, హాయ్, బాయ్ అంటూ పరిచయం అయిన వీరిద్దరు తరువాత గంటలు గంటలు చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే తాను ప్రేమించింది యువతి కాదని, ఆమెకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారని ప్రియుడికి తెలిసింది. తన భర్త, పిల్లలను వదిలేసి నీతో వచ్చేస్తానని ఆమె ప్రియుడికి చెప్పింది. ఇదెక్కడి రామాయణం అంటూ ప్రియుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
అయితే అప్పటికే ఆమెతో అతను అసభ్యంగా చేసిన చాటింగ్ అడ్డం పెట్టుకున్న మహిళ అతన్ని బ్లాక్ మెయిల్ చేసింది. డబ్బుతో సెటిల్ మెంట్ చేసుకోవలని ఇద్దరూ మాట్లాడుకున్నారు. కిలాడీ లేడీకి భయపడిన ఆమె ప్రియుడు తోడుగా ఓ యువకుడిని వెంట పెట్టుకుని వెళ్లాడు. అంతే అక్కడ రచ్చరచ్చ అయ్యింది. ఆ సమయంలో నువ్వు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అంటూ రెచ్చిపోయిన కిలాడీ లేడీ యాసిడ్ తీసుకుని ఆమె ప్రియుడి మీద పోసేయడం కలకలం రేపింది.
Khiladi
lady:
వీడియో
కాల్,
బెడ్
రూమ్
రొమాన్స్
వీడి
జీవితానే
మార్చేసింది,
ఆంటీ
ఎంట్రీ,
క్లైమాక్స్
లో!

వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఆదిమల్లి ప్రాంతంలో షీబా (35) అనే మహిళ నివాసం ఉంటున్నది. షీబాకు ఇంతకు ముందే వేరే వ్యక్తితో వివాహం అయ్యింది. భర్తతో కాపురం చేసిన షీబాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త బయటకు వెళ్లిన తరువాత షీబా ఆమె స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకుని సోషల్ మీడియాలో కాలం గడుపుతోంది.

ఫేస్ బుక్ లో లైన్ లోకి వచ్చిన యువకుడు
కేరళలోని తిరువనంతపురం సిటీలో అరుణ్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న అరుణ్ కుమార్ మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు. అరుణ్ కుమార్ కు సోషల్ మీడియా పిచ్చి విపరీతంగా ఉంది. గత ఏడాది అరుణ్ కుమార్, షీబాకు ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది.

గంటలు గంటలు చాటింగ్, ఫోన్ కాల్స్
మొదట హలో, హాయ్, బాయ్ అంటూ పరిచయం అయిన అరుణ్ కుమార్, షీబా తరువాత గంటలు గంటలు సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకున్న అరుణ్ కుమార్, షీబా విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. షీబా, అరుణ్ కుమార్ పెళ్లి చేసుకోవాలని కొంతకాలం క్రితం డిసైడ్ అయ్యారు.

అమ్మాయి కాదు..... పిల్లల తల్లి
ఇటీవల తాను ప్రేమించిన షీబా యువతి కాదని, ఆమెకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారని ప్రియుడు అరుణ్ కుమార్ కు తెలిసింది. తన భర్త, పిల్లలను వదిలేసి నీతో వచ్చేస్తానని షీబా ఆమె ప్రియుడు అరుణ్ కుమార్ కు చెప్పింది. ఇదెక్కడి రామాయణం అంటూ అరుణ్ కుమార్ పిల్లల తల్లి షీబా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. నేను వేరే పెళ్లి చేసుకుంటున్నానని, ఇక ముందు నాకు టచ్ లోకి రాకూడదని అరుణ్ కుమార్ షీబాకు తేల్చి చెప్పాడు.

డబ్బుతో సెటిట్ మెంట్
అప్పటికే షీబాతో అరుణ్ కుమార్ అసభ్యంగా చేసిన చాటింగ్ అడ్డం పెట్టుకున్న ఆమె అతన్ని బ్లాక్ మెయిల్ చేసింది. డబ్బుతో సెటిల్ మెంట్ చేసుకోవలని అరుణ్ కుమార్, షీబా మాట్లాడుకున్నారు. తిరువనంతపురం సమీపంలోని ఇరుంబుల్లాలోని ఓ చర్చిలో కలుసుకోవాలని మాట్లాడుకున్నారు. కిలాడీ లేడీ షీబాకు భయపడిన ఆమె ప్రియుడు అరుణ్ కుమార్ తోడుగా అతని స్నేహితుడిని పిలుచుకుని చర్చి దగ్గరకు వెళ్లాడు. అక్కడ షీబా రచ్చరచ్చ చేసింది.
Recommended Video

ప్రియుడి మీద యాసిడ్ పోసిన షీబా
డబ్బు విషయంలో షీబాకు, అరుణ్ కుమార్ కు తేడా వచ్చింది. ఆ సమయంలో నువ్వు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అంటూ రెచ్చిపోయిన కిలాడీ లేడీ షీబా యాసిడ్ తీసుకుని ఆమె ప్రియుడు అరుణ్ కుమార్ మీద పోసేయడం కలకలం రేపింది. అరుణ్ కుమార్ ముఖం కాలిపోవడంతో అతన్ని తిరువనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు. షీబా మీద యాసిడ్ పడటంతో ఆమెకు గాయాలు అయ్యాయని పోలీసులు అంటున్నారు. అరుణ్ కుమార్ స్నేహితుడు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసి షీబాను అరెస్టు చేశామని తిరువనంతపురం పోలీసులు తెలిపారు.