Viral Video: రైతులపై దూసుకెళ్లిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కారు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో హింసాత్మక పరిస్థితులకు దారి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తంగా ఎనిమిది మంది మరణానికి కారణమైంది ఈ ఘటన. నలుగురు రైతులు కారు కింద పడి దుర్మరణం పాలు కాగా.. ఆ తరువాత చోటు చేసుకున్న అలర్లు, హింసాత్మక వాతావరణంలో మరో నలుగురు మరణించారు. ఇద్దరు రైతులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కేంద్ర మంత్రి కారు..
లఖింపూర్ ఖేరి లోక్‌సభ సభ్యుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశీష్ మిశ్రా, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణించిన నల్లరంగు ఎస్‌యూవీ కారు అది. లఖింపూర్ ఖేరి సమీపంలోని టికూనియా వద్ద జెండాలను పట్టుకుని రోడ్డు మీద నిరసన ప్రదర్శనలను చేస్తోన్న రైతులపై ఉద్దేశపూరకంగా కేంద్ర మంత్రి తన కారును పోనిచ్చారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అజయ్ మిశ్రా, ఆయన కుమారుడిపై హత్యానేరం కింద కేసు కూడా నమోదైంది.

వీడియోను వెలుగులోకి తెచ్చిన కాంగ్రెస్..
ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చింది. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో దీన్ని పోస్ట్ చేసింది. 27 సెకెన్ల నిడివి ఉన్న వీడియో ఇది. జెండాలను పట్టుకుని ముందుకు నడుస్తోన్న రైతులపై ఓ నల్లరంగు ఎస్‌యూవీ కారు దూసుకెళ్లడం ఇందులో స్పష్టంగా రికార్డయింది. తొలుత తెల్లరంగు షర్ట్, లేత ఆకుపచ్చని తలపాగాను ధరించిన ఓ వృద్ధుడిని ఢీ కొట్టడం, అతను ఎగిరి బోనెట్ మీద పడటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
ఎస్‌యూవీ వెనుకే మరో కారు..
మరి కొందరు రైతులు తమను తాము రక్షించుకోవడానికి రోడ్డు పక్కకు దూకడం ఇందులో కనిపించింది. ఎక్కడా ఆగకుండా ఎస్‌యూవీ ముందుకు దూసుకెళ్లింది. ఆ ఎస్‌యూవీ వెనుకే మరో లగ్జరీ కారు వెళ్లడం ఈ వీడియోలో రికార్డయింది. కారు దూసుకెళ్లిన తరువాత రైతులు దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణంపాలు కాగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించారు. మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా ప్రదర్శనలు చేస్తోన్న రైతులపై ఉద్దేశపూరకంగానే కేంద్ర మంత్రి తన కారును పోనిచ్చారనేది ఈ వీడియోతో స్పష్టమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తోన్నారు.

హింసాత్మక పరిస్థితులు..
ఆ తరువాత చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల్లో ముగ్గురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కారు డ్రైవర్ మృతి చెందారు. అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. లఖింపూర్ ఖేరిలో పలుచోట్ల 144 సెక్షన్‌ను విధించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తితో ఈ దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 45 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియోను చెల్లిస్తామని ప్రకటించిది.
Recommended Video

ఇంటర్‌నెట్ బంద్..
లఖింపూర్ ఖేరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొత్త వారు ఎవరూ నగరంలోనికి రాకుండా ఉండేలా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్‌ఛార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియాంక గాంధీ వాద్రా ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. లఖింపూర్ ఖేరిలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు ఇంటర్‌నెట్‌ను నిలిపి వేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications