లఖింపూర్ ఖేరి హింసాకాండ ..మృతదేహాల అంత్య క్రియలకు నో అన్న బాధిత రైతు కుటుంబాలు, డిమాండ్లు ఇవే
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలోని టికునియాలో జరిగిన రైతు నిరసన కార్యక్రమంలో మరణించిన వారిలో ఇద్దరు రైతుల కుటుంబాలు మంగళవారం వారి మృతదేహాలకు పోస్టుమార్టం నివేదికలు వచ్చే వరకు దహనం చేయడానికి నిరాకరించారు.నచతార్ సింగ్ ఇంటికి మృతదేహం చేరుకున్నా వారు దహన సంస్కారాలు చెయ్యబోమని చెప్పారు. కుటుంబానికి మద్దతుగా స్థానిక రైతులు నిలబడ్డారు.లవ్‌ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు అంత్యక్రియల తర్వాత పోస్ట్‌మార్టం నివేదికలను తారుమారు చేయవచ్చని ఆరోపిస్తూ లవ్ ప్రీత్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా నిరాకరించారు.

ఆశిష్ మిశ్రాపై చర్యలు తీసుకునే వరకు దహనం చెయ్యమన్న లవ్ ప్రీత్ సింగ్ కుటుంబం
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో ఆదివారం జరిగిన హింసాకాండలో బలైన రైతులలో ఒకరుయువకుడైన 19 ఏళ్ల రైతు లవ్‌ప్రీత్ సింగ్. ఆ రైతు తాను మరణించే క్షణాల్లో, తన తండ్రిని తనను చేర్పించిన ఆసుపత్రికి త్వరగా రావాలని వేడుకున్నాడు. అతని కుటుంబం ఆసుపత్రికి చేరే సమయానికి చాలా ఆలస్యం అయింది. అప్పటికే లవ్ ప్రీత్ సింగ్ మరణించారు. లవ్ ప్రీత్ సింగ్ పోస్ట్ మార్టం ముగిసి మృత దేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించినా వారు దహన సంస్కారాలు చెయ్యటానికి నిరాకరిస్తున్నారు. ఆశిష్ మిశ్రాపై చర్యలు తీసుకునే వరకు దహనం చెయ్యబోమని చెప్తున్నారు.

పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేవరకు దహనం చెయ్యం అంటున్న లవ్ ప్రీత్ కుటుంబం
ఉత్తరప్రదేశ్ లఖింపూర్ కేరి లో మరణించిన రైతుల మృతదేహాలను పోస్టుమార్టం చేసిన వైద్యాధికారులు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. తమ కుమారుడు లవ్ ప్రీత్ సింగ్ మృతదేహం పక్కన ఏడుస్తూ, అతని కుటుంబం ఈ రోజు శవపరీక్ష నివేదిక, ఆశిష్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ కాపీని ఇచ్చే వరకు అతడిని దహనం చేసేది లేదని తేల్చి చెప్పింది. తన కొడుకు కారు కింద పడి ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటివరకు బాధ్యులైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ప్రభుత్వ ఈ ఘటనను కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తోందని లవ్ ప్రీత్ సింగ్ తండ్రి ఆరోపిస్తున్నారు.

తమ్ముడు లవ్ ప్రీత్ మృతదేహం చూసి దుఃఖిస్తున్న సోదరీమణులు
పోస్ట్ మార్టం రిపోర్ట్ తారుమారు చేసే అవకాశం ఉందని వారు ఆరోపిస్తున్నారు. లవ్‌ప్రీత్ ఇద్దరు సోదరీమణులు తమ ఏకైక సోదరుడిని విగతజీవిగా చూసి దుఃఖిస్తున్నారు. అతను ఒక మంచి పని కోసం బయలుదేరుతున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్లాడని, ఇప్పుడు తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన తరువాత తన కుమారుడు తనతో మాట్లాడాడని, త్వరగా రావాలని అభ్యర్థించాడని తాము లఖింపూర్ ఖేరికి వెళ్లేసరికే తమ కుమారుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వమే తమ కుమారుడిని తమకు దూరం చేసిందని వారు ఆరోపిస్తున్నారు.

లఖింపూర్ ఖేరీ ఘటన వీడియో వైరల్ .. పోస్ట్ మార్టం నివేదిక ఇలా
ఈ సంఘటనపై ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. మంత్రిని మంత్రి పదవి నుండి తొలగించాలని అతని కుమారుడిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన ఒక వైరల్ వీడియో వెలుగులోకి వచ్చింది . ఒక ఎస్యూవీ వాహనం వెనుక నుండి నిరసనకారుల సమూహంలోకి వెళ్లి వారిలో చాలా మందిని గుద్దుకుంటూ వెళ్లిన భయానక ఘటనను వీడియో స్పష్టంగా చూపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దారుణ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాల పోస్ట్‌మార్టం నివేదిక గాయాలు, షాక్ మరియు మెదడులో రక్తస్రావం వంటి అంశాలు మరణానికి కారణమయ్యాయని వెల్లడించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడిపై ఆరోపణలు .. ఆశిష్ మిశ్రాపై కేసు నమోదు
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా పర్యటనకు నిరసనగా ఆదివారం జరిగిన హింసాకాండలో మరణించిన ఎనిమిది మందిలో లవ్‌ప్రీత్ సింగ్ మరియు మరో ముగ్గురు రైతులు ఉన్నారు. మంత్రి కాన్వాయ్‌లో వాహనం రైతుల పైకి దూసుకు పోగా ఈ ఘటనలో కారు కింద పడి నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనకు మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా బాధ్యుడని, ఘటన జరిగిన సమయంలో అతనే కారు నడుపుతున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అతడిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications