యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం: లాలూ వర్సెస్ సుశీల్ షిండే

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీలు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో విమర్శలు చేసుకున్నారు. ఇరువురు ఘాటైన విమర్శల వరకు వెళ్లారు. ఇది చర్చనీయాంశంగా మారింది.

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఓ పక్క బీజేపీ ఈ వేడుకల్లో పాల్గొని సంబరాలు చేసుకుంటుంటే.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సుశీల్ కుమార్‌ మోదీలు ట్విటర్‌ వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శించుకున్నారు.

Lalu Yadav Trolls Sushil Modi Again, This Time It's Over Yogi Adityanath

యోగి యూపీ సీఎం కావడంపై లాలూ కామెంట్స్‌ చేశారు. దీంతో సుశీల్ కుమార్‌ ట్విటర్‌లో స్పందిస్తూ 'యోగి యూపీ సీఎం కావడంతో లాలూ షాకయ్యారు. ఏం తిట్టాలో కూడా ఆయనకి అర్థం కావడంలేద'ని ట్వీట్‌ చేశారు.

'రోగి యూపీ' స్వాగతం, యోగి వెళ్లగొడతారు, లాలూ జోకర్: అమర్ సింగ్

దీనికి లాలూ స్పందిస్తూ.. 'నువ్వు కూడా చెవి కుట్టించుకుని, గుండు గీయించుకుని, వేషధారణ మార్చుకో. అప్పుడిక నీకు అదృష్టం ఇట్టే వరిస్తుంది. నిన్ను ప్రమాణ స్వీకారానికి పిలవలేదని బాధపడకు' అని లాలూ ట్వీట్‌ చేశారు.

సుశీల్‌, లాలూ ట్విటర్‌లో ఇలా విమర్శలకు దిగడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా లాలూని సుశీల్‌ ఎగతాళి చేశారు. 'లాలూ భార్య ముఖ్యమంత్రి, అతని కుమారులు మంత్రులు. అంతకుమించి ఎవరినీ పార్టీలోకి ఆహ్వానించడం లేద'ని గతంలో ట్వీట్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Twitter enjoys healthy political rivalry. As Yogi Adityanath took oath as the Chief Minister of Uttar Pradesh, RJD chief Lalu Prasad Yadav and BJP leader Sushil Kumar Modi engaged in a war of words on Twitter.
Please Wait while comments are loading...