గంటలో ల్యాండింగ్ అనగా.. ముంబై-లండన్ ఎయిరిండియాకు ఎమర్జెన్సీ

లండన్: ఇటీవల కాలంలో విమానాలకు వరుసగా బెదిరింపు కాల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, ముంబై నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంకు బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం. దీంతో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ప్రకటించారు. మరో గంటలో లండన్‌లో దిగుతుందనగా.. ఈ పరిణామం చోటు చేసుకుంది.

Recommended Video

    Mumbai-London Air India Flight Receives Hoax Bomb Threat గంటలో ల్యాండింగ్ అనగా.. | Telugu OneIndia

    ముంబై నుంచి లండన్ వెళుతున్న ఎయిరిండియా విమానం ల్యాండింగ్‌కు గంట ముందు ఎమర్జెన్సీ సిగ్నల్స్ ని పంపించినట్లు ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్ రాడార్ 2 గురువారం తెలిపింది. విమానం స్వ్మాకింగ్ 7700 కోడ్‌ని పంపించింది. ఇది సాధారణ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తుంది. కారణం ప్రస్తుతం తెలియదు అని Flightradar ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

    Landing in another hour is an emergency for Mumbai-London Air India

    కాగా, ముంబై నుంచి ఎయిర్ ఇండియా విమానం గురువారం ఉదయం 7.05 గంటలకు టేకాఫ్ అయ్యింది. తూర్పు ఇంగ్లండ్ మీదుగా ప్రయాణించే సమయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. విమానం షెడ్యూల్ ప్రకారం హీత్రూ విమానాశ్రయంలో మధ్యాహ్నం 12.05 గంటలకు దిగాల్సి ఉంది.

    ఇప్పటికే దేశంలో పలు విమానాలకు బాంబు బెదిరింపులు రాగా.. తాజాగా, ఎయిరిండియా విమానానికి బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం. కాగా, గత నాలుగు రోజులుగా కనీసం 20 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. తాజాగా, ఐదు ఎయిర్ ఇండియా, రెండు విస్తారా, రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

    ఈ బాంబు బెదిరింపుల అంశంపై బుధవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. దీనికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, డీజీసీఏ అధికారులతో ఆ శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు సమావేశమయ్యారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రయాణికుల భద్రతే తమ ప్రాధాన్యమని కేంద్రమంత్రి తెలిపారు. ఈ ఘటనలపై సమగ్ర నివేదిక పంపాలని పౌర విమానయాన మంత్రిత్వశాఖను హోంమంత్రిత్వ శాఖ కోరింది. ఈ బెదిరింపు కాల్స్ అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+