కొండచరియలు విరిగిపడి.. కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికుల అవస్థలు..
ప్రతికూల వాతావరణం తెలుగు యాత్రికులను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో భారీ వర్షాల కారణంగా తెలుగు యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు. మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే అక్కడి అధికారులతో మాట్లాడి క్షేమంగా వారిని తీసుకువచ్చేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు.
సదరన్ ట్రావెల్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 18 మంది యాత్రికులు కేదార్‌నాథ్ దర్శనానికి బయలుదేరారు. అక్కడ దర్శనం ముగించుకున్న తర్వాత 14 మంది బద్రీనాథ్ వెళ్లేందుకు బలుదేరి వెళ్లారు. అయితే, భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్- బద్రీనాథ్ మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాలకు తీవ్రమైన చలిగాలులు తోడవ్వడంతో ఆ మార్గంలో చిక్కుకున్న యాత్రికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యాత్రికులలో నిజామాబాద్, విజయనగరంకు చెందిన వారు ఉన్నారు. అక్కడ చిక్కుకున్న యాత్రికులను రక్షించేందుకు హెలికాప్టర్ సర్వీసులను వినియోగించాలని భావించినప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా ఆ సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.

భరోసా ఇచ్చిన మంత్రి..
అయితే, అక్కడివారి పరిస్థితిని తెలుసుకున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులతో ఫోన్‌లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, అధికారులతో మాట్లాడి క్షేమంగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ఎంపీ కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌తో చర్చించారు. యాత్రికులలో పలువురు తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని, తక్షణం వారిని హెలికాఫ్టర్‌లో ఆస్పత్రికి తరలించి, వైద్య చికిత్స అందించాలని కోరారు. యాంత్రికుల కుటింబీకులకు ధైర్యం చెప్పారు.












Click it and Unblock the Notifications