దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

షాక్: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజీల్ ధరలు, కారణమిదే!

By Narsimha
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్ ధరలు పెరగనున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు ప్రకటించారు.

  మంగళవారం మెట్రోనగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు 10-12 పైసల చొప్పున పెరిగాయి. రోజువారీ ధరల సమీక్ష కింద ఉదయం 6 గంటలకు మారిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.69.8, కోల్‌కత్తాలో రూ.72.55, ముంబైలో రూ.76.9, చెన్నైలో రూ.72.35గా

  ఈ ధరలు సోమవారం నాటిధరలతో పోలిస్తే 11-12 పైసలు అధికం. అదేవిధంగా ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.58.26, కోల్‌కత్తాలో రూ.60.92, ముంబైలో రూ.60.98, చెన్నైలో రూ.61.36గా ఉన్నాయి. సోమవారం రేట్లతో పోలిస్తే డీజిల్‌ ధరలు కూడా లీటరుకు 10-11 పైకి ఎగిశాయి.

  Latest Petrol, Diesel Prices As Global Crude Oil Rates Rise to 2-Year Highs

  ఈ నెల మొదటి నుంచి లీటరు పెట్రోల్‌ ధరలు 65-71 పైసల చొప్పున పెరిగాయి. డీజిల్‌ ధరలు 56-60 పైసలు చొప్పున పెరిగాయి. 2017 జూన్‌ 16 నుంచి అంతర్జాతీయ క్రూడ్‌ ఆయిల్‌ ధరలకు అనుగుణంగా ప్రతి రోజూ పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. రోజువారీ ధరల సమీక్ష ప్రకారం అంతర్జాతీయ ఆయిల్‌ ధరల్లో మార్పులను వెనువెంటనే వినియగదారులకు చేరవేయలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.

  అయితే ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు పెరగడం తప్ప, తగ్గడం లేదు. ఈ క్రమంలో దేశీయంగా కూడా చమురు ధరలు మోతెక్కిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు 2015 జూన్‌ నాటి గరిష్ట స్థాయిలను నమోదుచేస్తున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 3.5 శాతం పెరిగి 64.23 డాలర్లుగా నమోదైంది.

  English summary
  Petrol and diesel prices today were raised by 10-12 paise per litre in metros. Effective 6 am Tuesday, petrol rates in the four major metros were at Rs. 69.8 per litre in Delhi, Rs. 72.55 per litre in Kolkata, Rs. 76.9 in Mumbai and Rs. 72.35 in Chennai, according to Indian Oil Corporation (IOC). The petrol rates were higher 11-12 paise per litre compared to Monday's prices.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more