జమిలి ఎన్నికలు సాధ్యం కాదు: తేల్చిచెప్పిన లాకమిషన్
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది. లోకసభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై లా కమిషన్ గురువారం స్పష్టతనిచ్చింది. జమిలి ఆలోచన మంచిదే కానీ, మన రాజ్యాంగానికి లోబడి అది సాధ్యం కాదని చెప్పింది.
దీనిపై లోతుగా చర్చించాలని, రాజ్యాంగ నిపుణుల సమక్షంలో నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడింది. జమిలి ఎన్నికలపై తయారు చేసిన డ్రాఫ్టును గురువారం లాకమిషన్ కేంద్రానికి సమర్పించింది. ఎన్నికల నిర్వహణ, సెక్యూరిటీపరమైన అంశాలకు సంబంధించి ఇది సాధ్యం కాదని చెప్పింది.

లా కమిషన్ ముసాయిదా ప్రకారం జమిలి ఎన్నికల ప్రతిపాదన కేవలం ప్రభుత్వానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఇందులో అందరి అభిప్రాయాలు సేకరించాలని, దీనిపై తుది నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వం అందరికీ సమాధానం చెప్పుకునేదిగా ఉండాలని, జమిలి ఎన్నికల ఆలోచన చాలా మంచిదని, దీని వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని, పరిపాలనా వ్యవస్థ మీద భారం తగ్గుతుందని, కానీ ఒకేసారి ఎన్నికలు జరిపితే భద్రతాపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందని, మన రాజ్యాంగ పరిమితులకు లోబడి జమిలి అసాధ్యమి చెప్పింది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications