జమిలి ఎన్నికలకు జై: మోదీ ప్రభుత్వం కదనోత్సాహం..!!
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయఢంకా మోగించింది. రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయాన్ని సాధించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 156 స్థానాల్లో పాగా వేసింది బీజేపీ. వార్ వన్ సైడ్ అయిందిక్కడ. కాంగ్రెస్ గానీ, ఆమ్ ఆద్మీ పార్టీ గానీ ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీల్లాంటి అభ్యర్థులు మట్టికరిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి సైతం ఓడిపోయారు.

థంపింగ్ విక్టరీ..
గుజరాతీయులు కాంగ్రెస్, ఆప్‌లను ఘోరంగా తిరస్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు. బీజేపీకి గంపగుత్తగా ఓటు వేశారు. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్‌లో బీజేపీ- 156 చోట్ల విజయాన్ని దక్కించుకుంది. ఈ స్థాయి విజయం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ నమోదు కాలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు కూడా ఇన్ని సీట్లు బీజేపీకి రాలేదు.

జమిలి జోష్..
ఈ విజయం- కేంద్రంలో బీజేపీ సారథ్యంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి జమిలి ఎన్నికల వైపు నడిపించేలా చేస్తోంది. 2024 లేదా అంతకంటే ముందే- దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలను నిర్వహించేలా ప్రోత్సహిస్తోన్నట్టే కనిపిస్తోంది. లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే అభిప్రాయాన్ని కేంద్ర మంత్రులు సైతం వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాజ్యసభలో లిఖితపూరకంగా..
జమిలి ఎన్నికల వల్ల దేశ ఖజానాపై భారం తగ్గుతుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తేల్చి చెప్పారు. ఈ మేరకు రాజ్యసభలో లిఖితపూరక సమాధానం ఇచ్చారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇదివరకు 1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సంస్కృతి కొనసాగలేదని వ్యాఖ్యానించారు.

ఆర్థికభారం తగ్గుతుంది..
1968, 1969లో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు గడువు కంటే ముందే ఎన్నికలకు వెళ్లాల్సి రావడం వల్ల జమిలి ఎన్నికలకు బ్రేక్ పడిందని వివరించారు. లోక్‌సభ, అసెంబ్లీకి వేర్వేరుగా ఎన్నికలను నిర్వహించాల్సి రావడం వల్ల ఖజానాపై ఆర్థికభారం పెరిగిపోతోందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను జరపాల్సిన అవసరం ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. సుస్థిర పరిపాలన కోసం కూడా జమిలి ఎన్నికలు అవసరమౌతాయనీ అభిప్రాయపడ్డారు.

లా కమిషన్ కూడా..
న్యాయ కమిషన్ కూడా తన 170వ నివేదికలోనూ ఇదే విషయాన్ని పేర్కొందని కిరణ్ రిజిజు గుర్తు చేశారు. ఎన్నికల చట్టాలపై సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిషన్ ఇది. పాలనలో స్థిరత్వం కోసం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను జరపాలని లా కమిషన్ తన 170వ నివేదికలో సూచించిందని, ప్రవర్తనా నియమావళిని సుదీర్ఘంగా అమలు చేయడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని కూడా ఇది అరికట్టగలదని అన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications