Leader: పొలిటికల్ లీడర్ టార్గెట్, భార్య, తల్లిని వదల్లేదు, ఆ విషయం కొంప ముంచిందా ?, రివాల్వర్లతో !
లక్నో/ఉత్తరప్రదేశ్: రాజకీయ కక్షలు మరోసారి పడగవిప్పాయి. రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తిని కొందరు టార్గెట్ చేసుకున్నారు. పొలిటికల్ లీడర్ ఇంట్లోనే ఉన్నాడని తెలుసుకున్న కొందరు వ్యక్తులు రివాల్వర్లు చేతిలో పట్టుకుని కాల్పులు జరుపుతూ ఆ పొలిటికల్ లీడర్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. పొలిటికల్ లీడర్ తో పాటు అతని భార్య, తల్లి మీద కాల్పులు జరిపారు. ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో ఆ రాజకీయ నాయకుడితో పాటు అతని భార్య, తల్లి స్పాట్ లో చనిపోయారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలసిమెలసి ఉండే రాజకీయ నాయకుడితో సహ ఆయన కుటుంబ సభ్యులు ఒకేసారి హత్యకు గురికావడం కలకలం రేపింది.

సమాజ్ వాదీ పార్టీ లీడర్
ఉత్తరప్రదేశ్ లో రాజకీయ నాయకులను ప్రత్యర్థులు టార్గెట్ చెయ్యడం కొత్తకాదు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీల నాయకులను కొందరు పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపేసిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో మరోసారి రాజకీయ కక్షలు మరోసారి పడగవిప్పాయి. రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న సమాజ్ వాదీ పార్టీ నాయకుడు రాకేష్ గుప్తాను కొందరు టార్గెట్ చేశారు.

రాజకీయాలకు అతీతంగా !
ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లా సమాజ్ వాదీ పార్టీ బ్లాక్ విభాగం అధ్యక్షుడిగా రాకేష్ గుప్తా పని చేస్తున్నాడు. సమాజ్ వాదీ పార్టీ బదౌన్ జిల్లాలో ఎంతో బలమైన నాయకుడిగా రాకేష్ గుప్తా పేరు సంపాధించుకున్నాడు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలసిమెలసి ఉండే రాజకీయ నాయకుడిగా బదౌన్ జిల్లాలో రాకేష్ గుప్తాకు మంచి పేరు ఉంది.

ఒకేసారి ముగ్గురి మీద కాల్పులు
పొలిటికల్ లీడర్ రాకేష్ గుప్తా సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నాడని తెలుసుకున్న కొందరు వ్యక్తులు రివాల్వర్లు చేతిలో పట్టుకుని కాల్పులు జరుపుతూ ఆయన ఇంట్లోకి వెళ్లారు. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు రాకేష్ గుప్తాతో పాటు అతని భార్య శాంతి దేవి, అతని తల్లి శారదా మీద ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు.

శత్రువులు చాలా తక్కువ
ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు రాకేష్ గుప్తాతో పాటు అతని భార్య శాంతి దేవి, తల్లి శారదా స్పాట్ లో చనిపోయారు. రాజకీయంగా రాకేష్ గుప్తాకు చాలా తక్కువ మంది ప్రత్యర్థులు ఉన్నారని, ఎందుకు ఒకేసారి ముగ్గురిని హత్య చేశారు ? అని కచ్చితంగా తెలియడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.

ఆ విషయం కొంప ముంచిందా ?
ఐదు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి రాకేష్ గుప్తా కుటుంబ సభ్యుల హత్య కేసును దర్యాప్తు చేస్తున్నామని బదౌన్ జిల్లా ఎస్పీ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. రాజకీయాలకు అతీతంగా అందరితో మంచితనంగా ఉండే రాకేష్ గుప్తాకు ఇంకా పలుకుబడి పెరిగిపోతుందనే కసితో చంపేసి ఉంటారని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications