Illegal affair: పొలిటికల్ లీడర్ ను వెంటాడి నరికేశారు. పక్కనే లేడీని లేపేశారు, ఇంట్లో, వీదిలో !
బెంగళూరు/ఆనేకల్: ఐటీ హబ్ సమీపంలో నివాసం ఉంటున్న పొలిటికల్ లీడర్ గ్రామ పంచాయితీ అధ్యక్షుడిగా పని చేశాడు. పార్టీలతో సంబంధం లేకుండా అతనికంటూ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ సంపాధించుకున్నాడు. గత ఎన్నికల్లో అతను మాజీ గ్రామ పంచాయితీ అధ్యక్షుడు అయ్యాడు. పదవి లేకున్నా మంచి పలుకుబడి పెట్టుకున్నాడు. బిగ్ షాట్ అయిన ఆ పొలిటికల్ లీడర్ నిత్యం ప్రజల్లో ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో మాజీ గ్రామ పంచాయితీ అధ్యక్షుడిని ప్రత్యర్థులు వెంటాడి అతి దారుణంగా చంపేశారు. పోలిటికల్ లీడర్ హత్యకు గురైన ప్రాంతంలోనే మరో యువతి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలిటికల్ లీడర్ కుటుంబ సభ్యులు, మద్దతుదారులు గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ సంబంధం కారణంగానే జంట హత్య జరిగాయని బెంగళూరు గ్రామీణ జిల్లా పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో లేడీ, వీదిలో లీడర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. మాజీ గ్రామ పంచాయితీ అనుచరులు ఇప్పుడు మా లీడర్ ను ఎవరు హత్య చేశారు ? అని కూపీ లాగుతున్నారు.

బెంగళూరు సిటీ శివార్లలో ?
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని బ్యాడరహళ్ళిలో నారాయణస్వామి అలియాస్ దాస అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఐటీ హబ్ బెంగళూరు సిటీ సమీపంలో నివాసం ఉంటున్న పొలిటికల్ లీడర్ నారాయణస్వామి బ్యాడరహళ్ళి గ్రామ పంచాయితీ అధ్యక్షుడిగా పని చేశాడు. పార్టీలతో సంబంధం లేకుండా నారాయణస్వామి అతనికంటూ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ సంపాధించుకున్నాడు.

పదవి పోయినా ఇమేజ్ మాత్రం సేఫ్
గత ఎన్నికల్లో నారాయణస్వామి మాజీ గ్రామ పంచాయితీ అధ్యక్షుడు అయ్యాడు. పదవి లేకున్నా నారాయణస్వామి స్థానికంగా అక్కడి ప్రజల్లో మంచి పలుకుబడి పెట్టుకున్నాడు. బిగ్ షాట్ అయిన పొలిటికల్ లీడర్ నారాయణస్వామి నిత్యం ప్రజల్లో ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. నారాయణస్వామి ఎక్కువగా అతని ఆనుచరులతో కలిసి బెంగళూరు వచ్చి వెలుతున్నాడు.

వెంటాడి నరికి చంపేశారు
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని సూర్యాసిటీ నగర్ సమీపంలోని రామయ్య లేఔట్ లో పోలిటికల్ లీడర్ నారాయణస్వామి మీద ఆయన ప్రత్యర్థులు దాడి చేశారు. బ్యాడరహళ్ళి మాజీ గ్రామ పంచాయితీ అధ్యక్షుడు నారాయణస్వామిని ప్రత్యర్థులు వెంటాడి వెంటాడి అతి దారుణంగా పరికి చంపేయడం కలకలం రేపింది.

పొలిటికల్ లీడర్ తో పాటు యువతి హత్య
పోలిటికల్ లీడర్ నారాయణస్వామి అలియాస్ దాస హత్యకు గురైన ప్రాంతంలోనే మరో యువతి కావ్యా (32) కూడా దారుణ హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ లక్ష్మీ గణేష్ సంగటనా స్థలానికి చేరుకుని జంటల హత్యలు జరిగిన ప్రాంతాలను పరిశీలించి వివరాలు సేకరించారు. తన కూతురు కావ్యాను దారుణంగా హత్య చేశారని ఇప్పటికే ఆమె తల్లి పోలీసు కేసు పెట్టింది.

అక్రమ సంబంధంతో జంట హత్యలు ?
బ్యాడరహళ్ళి మాజీ గ్రామ పంచాయితీ అధ్యక్షుడు నారాయణస్వామి హత్యకు గురైన ప్రాంతం సమీపంలోనే కావ్యా ఆమె ఇంటిలోనే హత్యకు గురైయ్యింది. నారాయణస్వామి, కావ్యాకు అక్రమ సంబంధం ఉందని, ఇదే విషయంలో ఇద్దరిని చంపేసి ఉంటారని బెంగళూరు గ్రామీణ జిల్లా పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నారాయణస్వామి హత్యకు గురైన విషయం తెలుసుకున్న అతని అనుచరులు, కుటుంబ సభ్యులు గుమికూడటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications