మాజీ ప్రధాని మనుమడికి మైండ్ బ్లాక్, ఇదెక్కడి ప్రచారంరా దేవుడా, ఊరు, పేరు లేకుండా ఓట్లు !
లోక్‌సభ ఎన్నికల ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది కర్ణాటకలో మొదటి నుంచి బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తుపై రెండు పార్టీలకు చెందిన కొందరు నాయకుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఇప్పుడు హాసన్‌లో జేడీఎస్, బీజేపీ కూటమికి ఎదురైన ఇబ్బందులను అధిగమించడంలో బీజేపీ నేతలు విజయం సాధించడంతో పాటు కూటమి అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ కోసం ప్రీతమ్ గౌడ ప్రచారం ప్రారంభించారు.
హాసన్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే బీజేపీ నాయకుడు ప్రీతం గౌడ ఎన్నికల ప్రచారం చెయ్యడం కలకలం రేపుతోంది. ప్రజ్వల్ తాత ప్రధానమంత్రి అయ్యారు. ప్రజ్వల్ తండ్రి ఆరు సార్లు హోలేనరశీపుర అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్వల్ కు ఆయన తండ్రికి పడిన ఓట్లకంటే ఒక్క ఓటు ఎక్కువ పడేటట్లు చూస్తానని, ఎందుకంటే తాను ఈ లోక్ సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నానని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ అంటున్నారు.

తాను ఓడిపోయినవాడిని, తన దగ్గర శ్రమ ఉందని, తనకు ప్రజల మద్దతు ఉందని చెబుతున్న ప్రీతం గౌడ ఎక్కడా జేడీఎస్ పార్టీ గుర్తు, ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ పేరు ప్రస్తావించకుండానే ఎన్నికల ప్రచారం చెయ్యడం ఇప్పుడు హాసన్ లో హాట్ టాపిక్ అయ్యింది. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని కోట్లాది మంది ప్రజలు కలలు కంటున్నారని, గత ఆరు నెలలుగా తాను కర్ణాటక రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నానని, తన వంతు సహకారం పార్టీకి అవసరం అని ప్రీతం గౌడ అంటున్నారు.
గతంలో కూడా తాను కర్ణాటకలో బీజేపీ 28 సీట్లలో 28 సీట్లు గెలవాలనే కలతో ఎన్నికల ప్రచారం చేశానని, ప్రతి బూత్ లో బీజేపీ గెలిస్తే దేశం మొత్తం గెలిచినట్లే అని ప్రీతం గౌడ అంటున్నారు. గతంలో తాను హాసన్ లో ఇంటికి వెళ్లి ప్రచారానికి పునాది వేశానని ప్రీతం గౌడ గుర్తు చేసుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు, సకలేశపుర సిమెంట్ మంజును మద్దతు ఇవ్వాలని ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు ప్రీతం గౌడ్ తెలిపారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యేలా తాము పని చేస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని ప్రీతం గౌడ అన్నారు.

హలేనరశీపుర అసెంబ్లీ నియోజకవర్గంలో జేడీఎస్ కు వచ్చిన ఓట్ల కంటే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి ఒక్క ఓటు ఎక్కువే వచ్చేటట్లు తాము పని చేస్తామని, ఈ విషయాన్ని మేము సవాల్‌గా తీసుకుంటున్నామని, బీజేపీ కార్యకర్తలు ఆ దిశగా పని చేస్తున్నారని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ఎన్నికల ప్రచారం ప్రారంభించామని ప్రీతం గౌడ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో 28 సీట్లు గెలవడం ద్వారా కర్ణాటక బీజేపీ సత్తాను చాటుతామని ప్రీతం గౌడ అన్నారు.
దేశం మొత్తం మీద 400 సీట్లకు పైగా ఎన్డీఏ గెలవాలి, అప్పుడే దేశం బాగుంటుందని ప్రీతం గౌడ అన్నారు. బీజేపీ పెద్దలు మాకు బాధ్యత ఇచ్చారని, మా బూత్ నంబర్ 89 నుండి లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించామని, వ్యక్తి కంటే పార్టీ పెద్దది, పార్టీ కంటే దేశం పెద్దది అని మోదీ మాటలు మాకు గుర్తు ఉన్నాయని ప్రీతం గౌడ అన్నారు. హాసన్ లోక సభ నియోజక వర్గంలో ఎన్డీఏ అభ్యర్థిని గెలిపిస్తామని అంటున్న బీజేపీ నాయకుడు ప్రీతం గౌడ ఎక్కడా జేడీఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ పేరు ఎత్తకుండా ఎన్నికల ప్రచారం చెయ్యడం ఇప్పుడు జేడీఎస్ ను కలవరపాటుకు గురి చేస్తోంది.
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications