ఊరు ఊరు, వాడవాడ, ఇంటింటిలో ఇదే తీరు, జైశ్రీరామ్, అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్ !

అయోధ్య రామ మందిరం ప్రారంభత్సవం రోజు దగ్గర పడటంతో దేశ విదేశాల్లోని హిందువులు పండుగ చేసుకుంటున్నారు. ఆదివారం ఒక్క రోజు గడిచిపోతే రామ మందిరం ప్రారంభోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడానికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ మతానికి చెందిన దాదాపు అన్ని వర్గాల వారు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కాషాయం జెండాలు పట్టుకుంటున్నారు.

హిందూ సంఘ సంస్థలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, శ్రీరామసేనతో పాటు వివిద హిందూ సంఘ సంస్థలు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్బంగా వారు వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో జోరుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దక్షిణ భారత దేశంలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రంగా కర్ణాటక గుర్తింపు తెచ్చుకుంది.

Leaders of Hindu communities are setting up huge cutouts of Sri Ram in Bengaluru

అయితే కర్ణాటకలో అధికారం కోల్పోయిన బీజేపీ ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్బంగా మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో లేకపోయినా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు హిందూ సంఘ సంస్థ కార్యకర్తలు ఎక్కడ చూసిన కాషాయం జెండాలు కనపడేలా ప్రయత్నించి ఆ ఏర్పాట్లు చేస్తున్నారు.

నగరాలు, పట్టణాలు, తాలుకా కేంద్రాలు, గ్రామాలు ఇలా ఓ ప్రాంతం అని తేడా లేకుండా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో జైశ్రీరామ్ అంటూ కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శ్రీరామచంద్రుడి కటౌట్లు అయితే హిందూ సంఘాలే పోటాపోటీగా ఏర్పాటు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరులో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చెయ్యడాన్ని సిద్దరామయ్య ప్రభుత్వం బ్యాన్ చేసింది.

అయితే బెంగళూరు నగరంలో బీబీఎంపీ పరిధిలోని ప్రతివార్డులో, ప్రతి వార్డులో, గల్లిగల్లిలో, ప్రధాన రహదారుల్లోని ఇరు వైపుల భారీగా తయారు చేసిన శ్రీరాముడి కటౌట్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి మీద, ప్రతి షాపు మీద జైశ్రీరామ్ అంటూ రాసిన కాషాయం జెండాలు కట్టారు. బెంగళూరులోని మహదేవపుర నియోజక వర్గంలో బారీ ఎత్తున శ్రీరాముడి కటౌట్లు ఏర్పాటు చేశారు.

Leaders of Hindu communities are setting up huge cutouts of Sri Ram in Bengaluru

కేఆర్ పురం రైల్వేస్టేషన్- వైట్ ఫీల్డ్ మెయిల్ రోడ్డులోని ఐటీపీఎల్ సమీపంలోని గరుడాచారపాళ్య మెట్రో రైల్వేస్టేషన్ దగ్గర కావేరినగర్ ఎంట్రన్స్ లో భారీ ఎత్తున జైశ్రీరామ్ నినాదంతో రాసిన భారీ కటౌట్ లు ఏర్పాటు చేశారు. ఫినిక్స్ మాల్ సమీపంలోని కావేరినగర్ లో నివాసం ఉండే మటన్ షాప్ యజమాని, వ్యాపారి ఏ వెంకటేష్, వ్యాపారులు కేఎల్ రాజేష్, లోకి, సి మురళి, ధనంజయ్, మంజు తదితరులు శ్రీరాముడి కటౌట్ కు పూలాభిషేకం నిర్వహించి జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. సోమవారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్ర ప్రాణ ప్రతిష్ట సందర్బంగా సోమవారం బెంగళూరు నగరంలోని బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కర్ణాటకకు చెందిన బీజేపీ పదాదికారులు బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అన్ని హిందూ దేవాలయాలు, ముఖ్యంగా రాముడి గుడి, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి హిందూ సంఘ సంస్థలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+