భారత్ దెబ్బ.. బహ్రెయిన్ పారిపోతున్న పాకిస్థాన్ ప్రధాని ?
భారత్- పాకిస్థాన్ యుద్ధం ప్రారంభం అయింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్.. పాకిస్థాన్ లోని లాహోర్, సియోల్ కోట్, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ ప్రారంభించింది. అక్కడి పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేస్తోంది. మరోవైపు పాకిస్థాన్ జమ్మూపై హమాస్ తరహా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. అయితే భారత వాయు సేన పాక్ ప్రయోగించిన దాదాపు 8 క్షిపణులు, డ్రోన్లను కూల్చేసింది.
భారత్ దెబ్బకు పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్ ప్రాంతాలలో భారీ పేలుళ్లు జరిగాయి. అటుపాక్ ప్రధాని షరీఫ్ ఇంటికి సమీపంలోనే భారీ పేలుడు సంభవించింది. ఆయన ఇంటికి 10 కిలోమీటర్ల పరిధిలోనే ఈ సంఘటన జరిగింది.
భారత ఆర్మీ భీకర దాడులకు పాకిస్థాన్ ఆర్మీ చేతులెత్తేసింది. భారత్ దాడిని తట్టుకోలేని చాలామంది ఆ దేశ అధికారులు దేశం వదిలి పారిపోతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ ప్రధాని షరీఫ్... బహ్రెయిన్ పారిపోతున్నట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు ప్రముఖ ఆర్మీ అధికారులు కూడా ప్రత్యేక విమానంలో వెళ్తున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. వీళ్లంతా లాహోర్ లోని స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తున్నట్లు సమాచారం. దీనిపై మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన రానుంది.

ఇక కాశ్మీర్ లో పాకిస్థాన్ 8 మిసైల్స్,10 డ్రోన్లతో దాడులకు పాల్పడింది. ఒక F16, రెండు F17 ఫైటర్ జెట్లను కూడా ప్రయోగించింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ మిసైల్స్, డ్రోన్ల ను కూల్చివేసింది. అలాగే F16, రెండు F17 యుద్ధ విమానాలకు కూడా నేలమట్టం చేసింది. జమ్ము సివిల్ ఎయిర్‌పోర్ట్, సాంబా, ఆర్ఎస్‌పుర, అర్నియా, ప్రాంతాల్లో 8 మిసైల్స్, డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నించింది. వెంటనే భారత ఆర్మీ S-400, ఆకాష్ ఎయిర్ సిస్టమ్‌తో ఈ మిసైల్స్, డ్రోన్ల ను సమర్థవంతంగా కూల్చివేసింది.












Click it and Unblock the Notifications