కొన్ని క్షణాలు పిల్లలకు దూరంగా తల్లి, అంతలోనే ఘోరం, కొంపముంచిన వాషింగ్ మెషీన్

వాషింగ్ మెషీన్ ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకొంది. వాషింగ్ మెషీన్ వద్ద ఆడుకొంటున్న చిన్నారులను వదిలి వెళ్ళిన తల్లికి ఊహించని షాక్ ఎదురైంది. వాషింగ్ మెషీన్ లో పడి చిన్నారులు మృత్యువాత పడ్డారు.

న్యూఢిల్లీ:వాషింగ్ మెషీన్ ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలితీసుకొంది. బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెసీన్ లో నీళ్లు నింపిన తల్లి డిటర్జెంట్ పౌడర్ కొనేందుకు పిల్లలను ఇంట్లోనే వదిలివెళ్ళింది.అయితే పిల్లలు వాషింగ్ మెషీన్ లో పడి చనిపోయారు.ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటుచేసుకొంది.

న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన సెక్టార్ -1 లో శనివారం నాడు ఈ ఘటన చోటుచేసుకొంది. రెండున్నర ఏళ్ళ వయస్సున్న కవలలు నిశాంత్, నక్షయ ప్రాణాలు కోల్పోయారు.

బట్టలు ఉతికేందుకుగాను నిశాంత్, నక్షయ తల్లి వాషింగ్ మెషీన్ లో నీళ్ళను నింపింది. వాషింగ్ మెషీన్ దగ్గరే ఈ ఇద్దరు కవలలు ఆడుకొంటున్నారు.అయితే డిటర్జెంట్ పౌడర్ లేకపోవడంతో పక్కనే ఉన్న దుకాణం వద్దకు వెళ్ళి డిటర్జెంట్ పౌడర్ కోసం వెళ్ళింది.

Left Alone For Minutes, 3-Year-Old Twins In Delhi's Rohini Climb Into Washing Machine, Die

ఆమె దుకాణం నుండి వచ్చేసరికి పిల్లలు కన్పించలేదు. ఇరుగుపొరుగు వారి సహయంతో కూడ వెతికినా ప్రయోజనం లేదు.ఆపీసుకు వెళ్ళిన భర్తకు సమాచారం ఇచ్చింది.అయితే పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు.

అయితే వాషింగ్ మెషీన్ లో చూస్తే ఇద్దరు పిల్లల మృతదేహాలు తేలియాడుతూ కన్పించారు. అయితే వాషింగ్ మెషీన్ నుండి పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కవలలు మరణించారని వైద్యులు ప్రకటించారు.మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+