తిరుచ్చిలో చిరంజీవి నామినేషన్, విజయ్ కోసం రంగంలోకి

వెండితెరపై తన యాక్షన్‌తో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో తన 'చాణక్యం' ప్రదర్శిస్తున్నారు. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేతగా తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆయన.. పెరంబూర్, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, తిరుచ్చి తూర్పు స్థానంలో తన నామినేషన్‌కు ఎలాంటి చట్టపరమైన ఆటంకాలు కలగకుండా ఉండేందుకు, విజయ్ కోసం చిరంజీవి రంగంలోకి దిగారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది.

విజయ్ పెరంబూర్ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో తనపై ఎలాంటి కేసులు లేవని పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత కొళత్తూరు ప్రచారంలో ఆయనపై ఒక కేసు నమోదైంది. దీనికి తోడు 2025 నాటి మరో పాత కేసు కూడా తిరుచ్చి తూర్పు నామినేషన్ సమయంలో వెలుగులోకి వచ్చింది. పెరంబూర్ అఫిడవిట్‌లో ఈ వివరాలు ఎందుకు లేవనే ప్రశ్నలు తలెత్తడంతో, ప్రత్యర్థులు దీనిని ఆసరాగా చేసుకుని నామినేషన్‌ను సవాలు చేసే అవకాశం ఉందని విజయ్ భావించారు. అందుకే ముందుజాగ్రత్తగా కొత్త ప్రమాణపత్రాలను దాఖలు చేయడమే కాకుండా, తన నమ్మకస్తుడైన చిరంజీవిని 'ప్లాన్-బి'గా సిద్ధం చేశారు.

Legal Hurdles for Vijay s Nomination TVK Leader Fields Dummy Candidate Chiranjeevi as a Safety Net

ఎవరీ Chiranjeevi? ఆస్తుల లెక్కలేంటి?

విజయ్ కోసం 'డమ్మీ' అభ్యర్థిగా నామినేషన్ వేసిన చిరంజీవి సాదాసీదా వ్యక్తి కాదు. టీవీఈకే కీలక నేత, మాజీ మంత్రి గుప కృష్ణన్ కుమారుడు. చిరంజీవి తండ్రి ఇప్పటికే లాల్‌గుడి నియోజకవర్గం నుంచి పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. చిరంజీవి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయనకు రూ. 1.71 కోట్ల చరాస్తులు, రూ. 3.05 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య అహానా పేరిట కూడా రూ. 2.05 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తిని తన మద్దతుదారుడిగా నిలబెట్టడం ద్వారా విజయ్ తన పట్టును నిరూపించుకున్నారు.

డమ్మీ అభ్యర్థి.. ఒక రాజకీయ కవచం

సాధారణంగా ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థి నామినేషన్ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురైతే, పార్టీ గుర్తును.. ఉనికిని కాపాడుకోవడానికి ఈ ప్రత్యామ్నాయ అభ్యర్థి విధానాన్ని అనుసరిస్తారు. ఒకవేళ విజయ్ నామినేషన్ ఆమోదం పొందితే, చిరంజీవి తన దరఖాస్తును ఉపసంహరించుకుంటారు. మొదటిసారి ఎన్నికల యుద్ధంలోకి దిగుతున్న తరుణంలో, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ విజయ్ వేసిన ఈ 'సేఫ్ అడుగు' ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+