రాజమౌళి దర్శకత్వంలో మిస్ అయిన చిరంజీవి-నాగార్జున మల్టీస్టారర్
వరుసగా 12 బ్లాక్ బస్టర్లతో అపజయమే ఎరుగని దర్శక ధీరుడిగా, భారతదేశంలో నెం.1 దర్శకుడిగా రాణిస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా వారణాసి చిత్రం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడోతేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. మొత్తం 120 దేశాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో మహేష బాబు పాన్ వరల్డ్ హీరో అయిపోయినట్లేనని ప్రిన్స్ అభిమానులు సంబరంగా ఉన్నారు. రాజమౌళి వేసే ప్రతి అడుగు అత్యంత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా ఉంటుంది. మహేష్ బాబుతో తీస్తున్న సినిమా కేవలం ఒక యాక్షన్ అడ్వెంచర్ మాత్రమే కాదు, అది అంతర్జాతీయస్థాయిలో ఉన్న సినీ ప్రియులందరినీ అరించేలా రూపుదిద్దకుంటోంది.
సింహాద్రి తీసిన తర్వాత అడిగాడు
రాజమౌళి కెరీర్ తొలిరోజుల్లో అంటే సింహాద్రి సినిమా తీసిన తర్వాత ఒక భారీ మల్టీస్టారర్‌కు ప్లాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలను ఒకే స్క్రీన్‌పై చూపించేలా రచయిత విజయేంద్రప్రసాద్ ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఆ సమయంలోనే ఈ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. అయితే అదే సమయానికి చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తుండటంతోపాటు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి బిజీగా ఉన్నారు. దీంతో షెడ్యూల్స్ కేటాయించడం వీలుకాలేదు. రాజమౌళి అడిగే సమయానికే నాగార్జు నాలుగు సినిమాలకు కమిట్ అయి ఉండటంతో డేట్స్ సర్దుబాటు కాలేదు. ఈ రెండు కారణాలతో అద్భుతమైన మల్టీస్టారర్ తెరకెక్కలేకపోయింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన రెండో తరంలోని ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసే అద్భుతమైన అవకాశాన్ని తెలుగు సినీ ప్రేక్షకులు కోల్పోయినట్లైంది.

ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సినీ ప్రియులు
ఆ పవర్‌ఫుల్ మల్టీస్టారర్ కథ ఇప్పటికీ రాజమౌళి వద్ద భద్రంగానే ఉంది. మరి భవిష్యత్తులో చిరంజీవి-నాగార్జున కాంబినేషన్ లో కాకపోయినా, వారి వారసుల కాంబినేషన్ లో అయినా తెరకెక్కే అవకాశం ఉందంటున్నారు. లేదంటే ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ కు మారుతుందా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే రాజమౌళి ఆలోచన ఏమిటనేది ఇంతవరకు తెలియలేదు. రాజమౌళి అంటే కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదు, అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసే ఒక బ్రాండ్. సినిమా పూర్తయిన తర్వాత తన సినిమాకు మార్కెటింగ్ మేనేజర్ కూడా ఆయనే అవుతాడు. మహేష్ బాబు సినిమాతో ఆయన గ్లోబల్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తారో చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
-
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications