High court:అత్త కోడళ్లపై హైకోర్టు సంచలన తీర్పు..!

ప్రతి ఇంట్లో అత్త కోడళ్ల మధ్య విబేధాలు తలెత్తడం సర్వసాధారణం. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. వీరిద్దరి మధ్య కొడుకు లేదా భర్త నలిగిపోతుంటాడు. అత్తలను హింసించిన కోడలు, అత్త కోడలుపై దుర్భాషలాడుతూ చిత్రహింసకు గురిచేసిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ కుటుంబంలోని అత్త కోడలు కొడుకుకు సంబంధించిన ఓకేసు హైకోర్టుకు చేరింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.

ఇక అసలు విషయానికొస్తే.. భారతీ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన మహిళ తన అత్తను, ఆ ఇంట్లో ఉండే వృద్ధురాలైన భర్త అమ్మమ్మలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉందని జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ బాధ్యత నుంచి తప్పించుకోకూడదంటూ వ్యాఖ్యానించింది. అదే సమయంలో తల్లికి భర్తను దూరం చేయరాదని దూరంగా ఉండాలంటూ ఒత్తిడికూడా చేయరాదని కోడలికి హైకోర్టు సూచించింది.

Legal Mandates:High Court Ruling on Womens Obligation to Serve Elderly Mother-in-Laws

జార్ఖండ్‌కు చెందిన రుద్రనారాయణ రాయ్ అనే వ్యక్తి విడాకుల కోసం స్థానిక ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని విచారణ చేసిన ధర్మాసనం భార్యకు నెలకు రూ.30వేలు కొడుకుకు రూ.15వేలు చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో సంతృప్తి చెందని రుద్రనారాయణ్.. హైకోర్టును ఆశ్రయించాడు.

విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరైన కారణం లేకుండా భర్తతో విడిపోయేందుకు సిద్ధపడిన మహిళకు మెయిన్‌టెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని భావించింది. అయితే కొడుకుకు ఇస్తున్న మెయిన్‌టెనెన్స్‌ను మాత్రం రూ.15వేల నుంచి రూ.25వేలకు పెంచుతూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును వెలువరించేందుకు కోర్టు రాజ్యాంగంలోని 51-A ఆర్టికల్‌ను రిఫర్ చేసింది. అదే సమయంలో యజుర్వేద, మనుస్మృతిలలో ఉన్న వాక్యాల్ని గుర్తుచేసింది.

భారతీయ గొప్ప సంస్కృతి సంప్రదాయాలను, విలువలను,వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 51-A చెబుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థలో భాగంగా ఉన్న అత్తను, ఆమె తల్లిని గౌరవించి సేవచేయాల్సిన బాధ్యత కోడలిపై ఉందని అభిప్రాయపడింది. ఇదే ఘనమైన భారతదేశ సంస్కృతని పేర్కొంది.

Legal Mandates:High Court Ruling on Womens Obligation to Serve Elderly Mother-in-Laws

అంతేకాదు మనుస్మృతి నుంచి కొన్ని వాక్యాలను న్యాయమూర్తి చెప్పడం జరిగింది. ఒక కుటుంబంలో మహిళ సంతోషంగా లేదంటే ... ఆ కుటుంబ వ్యవస్థ ధ్వంసం అవుతుందని చెప్పిన న్యాయమూర్తి... అదే మహిళ కుటుంబంలో సంతోషంగా ఉంటే ఆ కుటుంబం నిత్యం వర్థిల్లుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన భర్త, అత్త తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని రుద్రనారాయణ భార్య పియాలీ ఛటర్జీ కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు తన తల్లి నుంచి దూరంగా ఉండాలంటూ పియాలీ ఛటర్జీ తనపై ఒత్తిడి తీసుకొస్తోందని రుద్రనారాయణ న్యాయమూర్తి ముందు ఫిర్యాదు చేశాడు. తన తల్లితో నిత్యం గొడవకు దిగుతోందని జడ్జి దృష్టి తీసుకొచ్చారు రుద్రనారాయణ. గొడవకు దిగి తనకు చెప్పకుండానే తన పుట్టింటికి పియాలీ వెళుతోందని వెల్లడించారు.

ఇరువైపుల నుంచి వాదనలు విన్న ధర్మాసనం భర్తను తన తల్లి నుంచి దూరంగా ఉండాలని భార్య ఒత్తిడి తెస్తోందని చెప్పేందుకు సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. సరైన కారణం లేకుండా ఇలా చేయడం తప్పే అవుతుందని కోర్టు భావించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+