లతా మంగేష్కర్ కన్నుమూత: శాశ్వతంగా మూగబోయిన గానకోకిల కంఠం

ముంబై:ప్రఖ్యాత గాయని భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. నెల రోజులకు పైగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ బారిన పడటంతో ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రెండు రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచారు డాక్టర్లు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం శివాజీ పార్కునకు తరలించనున్నారు.

కరోనాతో ఆసుపత్రిలో..

లతా మంగేష్కర్‌కు తొలుత కరోనా వైరస్ సోకింది. రెండు రోజులుగా జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. జ్వరం తీవ్రమైంది. దీనితో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందించారు. మధ్యలో ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడినప్పటికీ.. మళ్లీ క్షీణించింది.

రెండు రోజులుగా వెంటిలేటర్‌పై

రెండు రోజులుగా లతా మంగేష్కర్ ఆరోగ్యం మళ్లీ దిగజారింది. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనితో ఆమెను డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచారు. పరిస్థితి విషమించిందంటూ ఆమెకు ట్రీట్‌మెంట్ అందించిన డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు. తాను లతాజీ ఆరోగ్య పరిస్థితులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నానంటూ చెప్పారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన విషయం తెలుసుకుని ఆమె చెల్లెలు, ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే శనివారం రాత్రే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లారు.

92 సంవత్సరాల లతాజీ..

లతా మంగేష్కర్ వయస్సు 92 సంవత్సరాలు. గత ఏడాది సెప్టెంబర్‌లో 92వ జన్మదిన వేడుకలను జరుపుకొన్నారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్నారు. చలన చిత్ర పరిశ్రమలో అత్యున్నత అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే, ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారం ఆఫీసర్ ఆఫ్ ద లీజియన్ హానర్‌ను అందుకున్నారు. దాదాపు అన్ని భాషల్లోనూ వేలకొద్దీ పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, గుజరాతీ, మరాఠీ.. ఇలా అన్ని భాషల చలనచిత్ర పరిశ్రమకు సేవలను అందించారు. 50 వేలకు పైగా పాటలు పాడారు.

భారతరత్న సహా..

లతా మంగేష్కర్ కన్నుమూత పట్ల సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. కళాకారులు విషాద సముద్రంలో మునిగిపోయారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న సహా పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను లతా మంగేష్కర్ సొంతం చేసుకున్నారు. చలన చిత్ర పరిశ్రమలో అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమెకు అవార్డులను అందజేసి, గౌరవించారు. కళా సంఘాలు అందజేసిన అవార్డులకు ఇక లేక్కలేదు.

రాష్ట్రపతి, ప్రధాని సహా

రాష్ట్రపతి, ప్రధాని సహా

లతా మంగేష్కర్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆమె లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. లతా మంగేష్కర్ మరణంతో ఓ సంగీత యుగం ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే, శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సహా పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+