వీడియో: దావణగెరె హైవేపై గాయపడ్డ చిరుత హల్ చల్

కర్ణాటకలోని దావణగెరె సమీపంలో జాతీయ రహదారిపై నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిరుతపులిని రక్షించడానికి అటవీ అధికారులు చేపట్టిన ఆపరేషన్.. ఊహించని విధంగా మలుపు తిరిగింది. ప్రమాదకరంగా మారింది. ట్రాన్విలైజ్ చేసిన తర్వాత కూడా.. గాయపడిన ఆ వన్యప్రాణి ఒక్క ఉదుటన సిబ్బందిపైకి లంఘించింది. ఈ ఘటనలో ఒకరిద్దరికి గాయాలయ్యాయి.

ఈ ఉదయం చోటుచేసుకుందీ ఘటన. సమీప అటవీ ప్రాంతం నుంచి దూసుకొచ్చిన ఈ చిరుత రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తోన్న సమయంలో ఓ కారు దాన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిందా చిరుత. నడవలేని స్థితిలో రోడ్డు పక్కన పడిపోయింది. దీన్ని గమనించిన కొందరు వాహనదారులు స్థానిక అటవీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో అధికారులు ప్రత్యేక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Leopard Hit by Car in Davangere in Karnataka Rescue Operation Turns Dangerous Official Knocked Down

గాయాలతో ఉన్న చిరుతను సురక్షితంగా వెటర్నరీ ఆసుపత్రికి తరలించడానికి చర్యలు చేపట్టారు. మొదట దానికి ట్రాంక్విలైజర్ డార్ట్‌ ఇచ్చారు. సాధారణంగా ఈ మత్తుమందు వన్యప్రాణుల శరీరంపై పూర్తి ప్రభావాన్ని చూపడానికి కొంత సమయం పడుతుంది. పక్కనే ఉన్న సిబ్బంది మత్తుమందు పనిచేసిందని భావించి దాన్ని బంధించడానికి వెళ్లారు. దీంతో ఆ చిరుత ఒక్కసారిగా సిబ్బందిపైకి ఎగిరి దూకింది. చిరుతపులి పంజా విసరడంతో ఆ అధికారి క్షణాల వ్యవధిలో రోడ్డుపై పడిపోయాడు.

బెంగళూరు యశ్వంత్ పుర మార్కెట్ యార్డ్ లో డీకే శివకుమార్ ఆకస్మిక తనిఖీ- టీ, టిఫన్ అక్కడే
బెంగళూరు యశ్వంత్ పుర మార్కెట్ యార్డ్ లో డీకే శివకుమార్ ఆకస్మిక తనిఖీ- టీ, టిఫన్ అక్కడే

అక్కడే ఉన్న తోటి సిబ్బంది కర్రలను ఉపయోగించి శబ్దాలు చేస్తూ చిరుతపులిని భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో బెదిరిపోయిన ఆ చిరుత.. రోడ్డు పక్కన ఉన్న గడ్డి పొదల్లోకి వెళ్లిపోయింది. చివరకు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి ప్రత్యేక వలల సాయంతో ఆ చిరుతపులిని సురక్షితంగా అదుపులోకి తీసుకుని బోనులో బంధించారు. అత్యవసర చికిత్స కోసం దావణగెరె వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం కారణంగా చిరుత శరీరానికి తగిలిన గాయాలకు డాక్టర్లు చికిత్స అందించారు.

కర్ణాటకలో 108 అంబులెన్సులు బంద్: డీకే శివకుమార్ సర్కార్ కు 15 రోజుల డెడ్ లైన్
కర్ణాటకలో 108 అంబులెన్సులు బంద్: డీకే శివకుమార్ సర్కార్ కు 15 రోజుల డెడ్ లైన్

రహదారులపై జంతువుల కదలికలకు వీలుగా ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించినట్టయింది. వన్యప్రాణుల సంరక్షణ చర్యల్లో ఉండే సవాళ్లు, ప్రమాదం జరిగిన సందర్భాలలో అటవీ సిబ్బందికి తగిన భద్రతా పరికరాలు అందించాలన్సిన అవసరం ఉందని కూడా ఈ ఘటన గుర్తు చేసింది. చిరుత దాడికి గురైన అధికారి ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+