రూపాయిపై పిడుగు.. పాతాళానికి మారకపు విలువ!

అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ ఒత్తిడి పెరుగుతోంది. మిడిల్ ఈస్ట్ పరిణామాలతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతుండటంతో భారతీయ రూపాయి రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. మంగళవారం నాటి ప్రారంభ ట్రేడింగ్‌లోనే అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 10 పైసలు క్షీణించి 94.66 స్థాయికి పడిపోయింది. గత కొద్ది రోజులుగా వరుసగా పతనమవుతున్న రూపాయి మార్కెట్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

భయపెడుతున్న 'క్రూడ్ ఆయిల్'..

ఈ పతనానికి ప్రధానంగా ముడిచమురు ధరల పరుగులనే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం దాదాపు 0.63 శాతం పెరిగి బ్యారెల్‌కు $97.61 వద్దకు చేరింది. త్వరలోనే ఇది డాలర్ 98 మార్కును దాటే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు, 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' మార్గంలో ముడిచమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనలతో క్రూడ్ ఆయిల్ వ్యాపారుల్లో భయాలు మరింత పెరిగాయి.

Rupee Falls 10 Paise to 94 66 Against US Dollar as Crude Oil Price Soars Towards 98 Mark Globally
RBI ఆటాడకపోతే రూపాయి పరిస్థితి ఏంటి? చమురు దెబ్బకు విలవిల..
RBI ఆటాడకపోతే రూపాయి పరిస్థితి ఏంటి? చమురు దెబ్బకు విలవిల..

ఆర్బీఐ ధీటైన రక్షణ..

చమురు మంటల వల్ల రూపాయి మరీ దారుణంగా పడిపోకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమయానుకూలంగా రక్షణ గోడగా నిలుస్తోంది. ఆర్బీఐ నిరంతరం డాలర్లను విక్రయించడం, అలాగే ప్రత్యేక పథకాల కింద దేశంలోకి విదేశీ మారకద్రవ్యం రాక స్థిరంగా ఉండటంతో పతనం కొంత పరిమితమైంది. ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. రూపాయి ప్రస్తుతం 94.00 నుంచి 94.75 శ్రేణిలోనే లావాదేవీలు సాగించే అవకాశం ఉంది. డాలర్ ఇండెక్స్ బలహీనపడటం, ఆర్బీఐ జోక్యంతో రూపాయి కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది.

రూపాయి జాతకం మారిందా? ఆర్బీఐ మాస్టర్ ప్లాన్ వర్కౌట్!
రూపాయి జాతకం మారిందా? ఆర్బీఐ మాస్టర్ ప్లాన్ వర్కౌట్!

స్టాక్ మార్కెట్లలో ఉత్కంఠ..

రూపాయి క్షీణతతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 382 పాయింట్లకు పైగా పతనమై 75,750 వద్దకు చేరగా, నిఫ్టీ దాదాపు 98 పాయింట్లు నష్టపోయి 23,681 వద్దకు చేరుకుంది. సెప్టెంబర్ 16న జరగనున్న కీలకమైన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (FOMC) సమావేశం, అలాగే భారత్ - అమెరికాల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల కోసం ఇన్వెస్టర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+