నియోజకవర్గానికి వెయ్యి కుట్టుమిషన్లు ఫ్రీ.. సెప్టెంబర్ 15 వరకే.. మహిళలకు సువర్ణావకాశం!

రాష్ట్రవ్యాప్తంగా బీసీ మహిళలకు శుభవార్త. బీసీల ఆర్థిక అభ్యున్నతి కోసం, అందులోనూ ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం బిసి మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహిళలు ఉచిత కుట్టు మిషన్లను పొందడం కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలో వెయ్యి కుట్టు మిషన్లు ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంది.

బీసీ మహిళలకు ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కింద ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారులు కోరుతున్నారు. బీసీ మహిళల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హులైన మహిళలు http://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Free Sewing Machines for BC Women in Telangana - Apply before september 15th for Economic Empowerment Scheme

దరఖాస్తుదారుల వయస్సు 18 నిండి 55 సంవత్సరాల వయసు ఉన్నవారే అర్హులని తెలియజేశారు. వితంతు, ఒంటరి, వికలాంగులు, అనాధ మహిళలకు, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని వారు చెబుతున్నారు. నివాసం, కులం, ఆదాయం, ఆధార్, విద్యార్హత, టైలరింగ్ శిక్షణకు సంబంధించిన ధ్రువపత్రాలు, తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలని సూచిస్తున్నారు.

కనీస అక్షరాస్యత తప్పనిసరి అని, ఎక్కువ దరఖాస్తులు వస్తే కనీస విద్యార్హత ఐదవ తరగతి పాసైన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ అవకాశం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఉంటుందని, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణులకు 1.50లక్షలు, పట్టణ వాసులకు రెండు లక్షల లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీ స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక లబ్ధి పొందిన వారు అర్హులు కాదని స్పష్టం చేశారు.

TGFDC యంగ్ ఫిల్మ్‌మేకర్ ఛాలెంజ్ 2026... నగదు బహుమతులు, యువతకు గోల్డెన్ ఛాన్స్!
TGFDC యంగ్ ఫిల్మ్‌మేకర్ ఛాలెంజ్ 2026... నగదు బహుమతులు, యువతకు గోల్డెన్ ఛాన్స్!

దరఖాస్తుదారులు దరఖాస్తులను సంబంధిత వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని కుల, ఆదాయ, నివాస, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, విద్యార్హతలు, టైలరింగ్ శిక్షణ, అనుభవం తదితర ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామీణులు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారికి, పట్టణ ప్రాంతవాసులు సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు సెప్టెంబర్ 15లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. సెప్టెంబర్ 15వ తేదీ చివరి తేదీ అని, ఉచిత కుట్టు మిషన్ పొందాలంటే ఈ తేదీలోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+