వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్: పిల్లల్ని కనేందుకు జీవిత ఖైదీకి 2 వారాల లీవ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తికి మద్రాస్ హైకోర్టు బంపర్ ఆఫరిచ్చింది. సంతానాన్ని కనేందుకు రెండు వారాల పాటు కోర్టు ఆ ఖైదీకి సెలవు మంజూరు చేసింది. ఆ ఖైదీకి ప్రభుత్వం గతంలో పెరోల్ ఇవ్వలేదు. కానీ, కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని సెలవు మంజూరు చేసింది. అవసరమైతే మరో రెండు వారాల పాటు సెలవును పొడిగించే అవకాశం ఉందని ప్రకటించింది.

భార్యాబాధితుడి కేసులో ట్విస్ట్: లాయర్‌‌పై నిందలు మోపిన భర్తభార్యాబాధితుడి కేసులో ట్విస్ట్: లాయర్‌‌పై నిందలు మోపిన భర్త

గతంలో పెరోల్ రద్దు చేసిన ఖైదీకి మద్రాస్ హైకోర్టు బంపర్ ఆఫర్ ఇచ్చింది. పిల్లలు కనేందుకు గాను జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీకి 2 వారాల పాటు కోర్టు సెలవును మంజూరు చేసింది.

బెజవాడలో సంచలనం: పెళ్ళైందని ప్రశ్నిస్తే నా భార్య వేధిస్తోంది, కోర్టును ఆశ్రయించిన భర్తబెజవాడలో సంచలనం: పెళ్ళైందని ప్రశ్నిస్తే నా భార్య వేధిస్తోంది, కోర్టును ఆశ్రయించిన భర్త

అంతేకాదు ఆ ఖైదీ పారిపోతారనే అనుమానం ఉంటే సివిల్ దుస్తుల్లో కానిస్టేబుల్‌ను కాపలాగా నియమించాలని కోర్టు సూచించింది. ఖైదీ భార్య విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని మద్రాసు హైకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకొంది.

పిల్లల్ని కనేందుకు ఖైదీకి రెండు వారాల సెలవు

పిల్లల్ని కనేందుకు ఖైదీకి రెండు వారాల సెలవు

పిల్లల్ని కనేందుకు జైల్లో శిక్షణను అనుభవిస్తున్న జీవిత ఖైదీకి రెండు వారాల పాటు మద్రాస్ హైకోర్టు సెలవు మంజూరు చేసింది. ఈ శిక్షను అనుభిస్తున్న ఖైదీ భార్య కోర్టును కోరడంతో ఈ మేరకు కోర్టు సెలవు మంజూరు చేసింది.అవసరమైతే మరో రెండు వారాల పాటు సెలవును పొడిగించేందుకు కూడ అభ్యంతరం లేదని కోర్టు అభిప్రాయపడింది.

నేరస్థుడికి సంతానాన్ని పొందే హక్కుంది

నేరస్థుడికి సంతానాన్ని పొందే హక్కుంది

నేరస్థుడికి సంతానాన్ని పొందే హక్కు ఉందని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. జీవితఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి భార్యకు 32 ఏళ్ళు. ఈ దంపతులకు పిల్లలు లేదరు. ఆమె అభ్యర్థనను పురస్కరించుకొని కోర్టు సెలవును మంజూరు చేశారు.ఈ ఖైదీకి సంతానం కలిగే అవకాశం ఉన్నందున సెలవు మంజూరు చేసినట్టు కోర్టు అభిప్రాయపడింది.నేరస్తుడు పారిపోతాడని భావిస్తే అతడికి సివిల్ దుస్తుల్లో కానిస్టేబుల్‌ను నియమించాలని కోర్టు సూచించింది.

విదేశాల్లో అనుమతిస్తున్నారు.

విదేశాల్లో అనుమతిస్తున్నారు.

దాంపత్య బంధాన్ని కొనసాగించేందుకు దంపతులకు చాలా దేశాల్లో అనుమతి ఇస్తున్నారని కోర్టు గుర్తు చేసింది.రాష్ట్రంలోని జైళ్ళలో కూడా అటువంటి ఏర్పాట్లు చేయడానికిగల అవకాశాలను పరిశీలించేందుకు కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే హక్కుంది

లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే హక్కుంది

దంపతుల్లో ఒకరు జైలులో ఉన్నపుడు, మరొకరు జైలుకు వచ్చి, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే హక్కు ఖైదీలకు ఉందని కోర్టు గుర్తు చేసింది. అయితే ఇది ప్రత్యేక హక్కు కాదని కేంద్ర ప్రభుత్వం తీర్మానించిందని తెలిపింది.

English summary
A 40-year-old man serving a life sentence has been granted two-week leave by a court in Tamil Nadu so that he and his wife can have a child.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X