మాస్టర్‌పై అభిమానం: సచిన్ భారీ కేక్ విగ్రహం
బెంగళూరు: తన అభిమానులకు అభినందనలు తెలియజేయడానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కర్ణాటకలోని బెంగళూరు నగరానికి రానున్నారు. అయితే సచిన్ టెండూల్కర్ స్వయంగా బెంగళూరుకు రావడం లేదు. ప్రపంచ భారీ కేక్ షోలో భాగంగా సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని కేక్‌తో రూపొందించి అభిమానుల సందర్శన కోసం డిసెంబర్ 13 నుంచి 29 వరకు ప్రదర్శించనున్నారు.
ఈ ప్రదర్శనలో సచిన్ టెండూల్కర్ కేక్ విగ్రహం అమితంగా ఆకట్టుకోనుందని నిర్వాహకులు చెబుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండూల్కర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసేందుకే ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు వారు తెలిపారు. నవంబర్ 16న ముంబైలోని వాంఖడే స్టేడియంలో 200వ టెస్ట్ మ్యాచ్ ఆడిన 24ఏళ్ల మాస్టర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

సచిన్ టెండూల్కర్‌కు వీరాభిమాని అయిన సి రామచంద్రన్ అనే వ్యక్తి ఈ భారీ విగ్రహాన్ని రూపొందించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపేందుకే అతని రూపంలో కేక్, క్రిమ్‌తో విగ్రహాన్ని రూపొందించినట్లు 74ఏళ్ల అభిమాని రామచంద్రన్ తెలిపారు.
లండన్‌లోని మేడం టుస్సాడ్స్‌లో రూపొందించిన మైనపు విగ్రహాలకు దీటుగా ఈ విగ్రహం ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. ఒక వేళ మీరు సచిన్ టెండూల్కర్ కేక్ విగ్రహాన్ని చూడాలనుకుంటే బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఇండియన్ స్కూల్ మైదానాన్ని డిసెంబర్ 13 నుంచి 29లోపు సందర్శించాలని నిర్వాహకులు తెలిపారు.












Click it and Unblock the Notifications