బడ్జెట్ రోజే చనిపోయిన ఎంపీలు: అహ్మద్ లాగే.. అప్పట్లోను..

1954లో ఏప్రిల్‌ 19న రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిన రోజే ఎంపీ జుజుహర్‌ పాల్‌ సోరియన్‌ మరణించారు.

న్యూఢిల్లీ: కేరళకు చెందిన మాజీ కేంద్రమంత్రి, ఎంపీ అహ్మద్ నేటి ఉదయం కన్నుమూయడంతో.. పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ ను వాయిదా వేస్తారా? అన్న అనుమానాలు కలిగాయి.

అయితే లోక్‌సభ స్పీకర్ ఇందుకు నిరాకరించడంతో ఎంపీ మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కాగా, గతంలోను రెండుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే ఎంపీలు మరణించిన సందర్బాలు ఉన్నాయి.

Like E Ahmed there are two more MPs died in Past

1971లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిన రోజే మంత్రి ఎంబీ రానా కన్నుమూశారు.అయితే అప్పటి స్పీకర్‌ జీఎస్‌ థిల్లాన్‌ పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు అంగీకరించడంతో.. అదేరోజు సాయంత్రం 5గం.కు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

మరో సందర్బంలో.. 1954లో ఏప్రిల్‌ 19న రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిన రోజే ఎంపీ జుజుహర్‌ పాల్‌ సోరియన్‌ మరణించారు. అయితే స్పీకర్ అంగీకారంతో జుజుహర్ మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం అదే రోజు సాయంత్రం 5గం.కు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+