ఫామ్ హౌజ్ లో కాళ్లు చేతులు నరికేశారు
చండీగడ్: పంజాబ్ లో దారుణం జరిగింది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి ఫామ్ హౌజ్ లో ఇద్దరి కాళ్లు, చేతులు నరికేశారు. చికిత్స విఫలమై ఒకరు మరణించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
పంజాబ్ లోని పజిల్కా జిల్లాలోని అబోహర్ ప్రాంతంలో అక్కడి అధికార పార్టీ అకాలీదళ్ నేత శివలాల్ దోడా అనే వ్యక్తి ఫామ్ హౌజ్ ఉంది. ఈ ఫామ్ హౌజ్ లో శనివారం బీమ్ టంక్ అనే వ్యక్తి రెండు కాళ్లు, చేతులు నరికేశారు.
తరువాత గుర్జిత్ సింగ్ అనే వ్యక్తి ఓ చెయ్యి, కాలు నరికేశారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో బీమ్ టంక్ అనే వ్యక్తి మార్గం మద్యలో మరణించాడు. గుర్జిత్ సింగ్ అమృత్ సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గుర్జిత్ సింగ్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. నరబలి కోసం ఇద్దరిని హత్య చెయ్యడానికి ప్రయత్నించారని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దారుణ సంఘటనపై పంజాబ్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి అకాలీదళ్ నేత శివలాల్ దోడా, ఆయన మేనల్లుడితో సహా మొత్తం 11 మంది మీద కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశామని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఎలాంటి అరెస్టులు చెయ్యలేదని పోలీసులు తెలిపారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications