లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విమానం గుజరికి
ముంబై: లిక్కర్ కింగ్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ టీం యజమాని విజయ్ మాల్యాకు లేనిపోని కష్టాలు వస్తున్నాయి. ఆయన అనేక సంవత్సరాలు ఎక్కడ సంచరించాలన్నా ఒక ప్రత్యేక జెట్ విమానంలో వెళ్లేవారు. ఆయనకంటూ ఆ ప్రత్యేక జెట్ విమానం (ప్రైవేటు విమానం) ఉండేది.
విజయ్ మాల్యాకు చెందిన 11 సీట్ల ప్రత్యేక విమానం గుజరిపాలైయ్యింది. విజయ్ మల్యా కలలుకని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ స్థాపించారు. అయితే కింగ్ ఫిషర్ రెక్కలు గాలిలో ఎగరలేకపోయాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాల భారినపడింది.
చివరికి ఉద్యోగలుకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లైసెన్స్ రద్దు అయ్యింది. విజయ్ మాల్యా కల చెదిరి పోయింది. విజయ్ మాల్యాకు చెందిన ప్రతేక జెట్ విమానాన్ని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో వేలం వేశారు.

ముంబైకి చెందిన సైలెంట్ ఎంటర్ ప్రైజర్స్ అనే సంస్థ రూ. 22 లక్షలు చెల్లించి విజయ్ మల్యా విమానం సైలెంట్ గానే కొనుగోలు చేశారని మిడ్ డే పత్రిక ప్రచురించింది. తరువాత విమానం విడిభాగాలు వేరు చేసి గుజరికి విక్రయించి లాభం తెచ్చుకుంటామని ఆ సంస్థ నిర్వహకులు నిర్దారించారు.
ఈ నెల 6వ తేది నుండి విమానం విడిభాగాలు వేరు చేసే పనిలో నిమగ్నం అయ్యారు. వచ్చే వారంలో విమానం విడిభాగాలు పూర్తిగా వేరు చేస్తామని అంటున్నారు. పలువురు కార్మికులు రోజుకు 8 గంటల పాటు పని చేస్తు విమానం విడిభాగాలను వేరు చేస్తున్నారు.
విజయ్ మాల్యా కు చెందిన విమానం నుండి 6.5 టన్నుల గుజరి సరుకు వస్తుందని సంస్థ నిర్వహకులు అంటున్నారు. ఓబెరాయ్ గ్రూప్ కు చెందిన ఈ జెట్ విమానం మీద విజయ్ మాల్యా ముచ్చటపడ్డారు. 2005లో ఆ విమానం కొనుగోలు చేశారు.
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వలన తీవ్రనష్టాల భారిన పడిన విజయ్ మల్యాకు ఒక్కోక్కటి దూరం అవుతున్నాయి. ముంబాయిలోని విలెపార్లే ప్రాంతంలో ఉన్న సుమారు రూ. 100 కోట్ల విలువైన కింగ్ ఫిషర్ హౌస్ విజయ్ మల్యాకు దూరం అయ్యే అవకాశం ఉందని బ్యుసినెస్ టుడే పత్రిక కథనం ప్రచురించింది.
Once a sign of liquor baron Vijay Mallya's prosperity is being taken apart to be sold as scrap pic.twitter.com/81j9OF8fZa
— HeadlinesToday (@HeadlinesToday) April 15, 2015 











Click it and Unblock the Notifications