మణిపూర్ మళ్లీ కాంగ్రెస్‌దే: రెండో స్థానంలో బీజేపీ
60 సీట్లు ఉన్న మణిపూర్ లో ఓట్ల లెక్కంపు కాసేపట్లో పూర్తి కాబోతోంది. కాంగ్రెస్ 25, బీజేపీ 21 స్థానాలు కైవసం చేసుకోగా, ఇతరులు 11 స్థానాల్లో గెలుపొందారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు తరువాత దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది.
మిత్రపక్షాలను కూడగట్టుకోగలిగితే గోవా కూడా బీజేపీ ఖాతాలో చేరే అవకాశముంది. మరోవైపు మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ఇక్కడ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక మణిపూర్ లో కాంగ్రెస్, బీజేపీల నడుమ పోరు పోటాపోటీగా సాగింది. ఒక్కోసారి ఒక్కో పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. కానీ చివరికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీయే అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగా, బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇతర పార్టీలు గనుక కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి లేకపోలేదు.

మణిపూర్ ఓట్ల లెక్కింపు విశేషాలు...
6.00 : మణిపూర్ లో కాంగ్రెస్ 25 స్థానాల్లో , బీజేపీ 21 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు 11 స్థానాల్లో గెలుపొందారు.
5.40 : మణిపూర్ లో కాంగ్రెస్ మొత్తం 24 సీట్లను కైవసం చేసుకుంది. మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇటు బీజేపీ 20 సీట్లను గెలుచుకుంది.
5.38 : ఇక మీదట ఎలాంటి ఎన్నికల్లోనూ పాల్గొనరాదని నేను భావిస్తున్నాను - ఓటమి అనంతరం మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల వ్యాఖ్య.
4.50 : కాంగ్రెస్ 21 సీట్లను గెలుచుకోగా, బీజేపీ 18 సీట్లు గెలుచుకుంది.
4.20 : కాంగ్రెస్ 19 స్థానాలలో, బీజేపీ 18 స్థానాలలో విజయం సాధించాయి.
3.45: మణిపూర్ లో పోరు హోరాహోరీ. బీజేపీ 17 స్థానాల్లో, కాంగ్రెస్ 16 స్థానాల్లో గెలుపొందాయి.
3.45: నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ చెరో 3 సీట్లు గెలుచుకున్నాయి.
3.05 : మణిపూర్ లో హోరాహోరీ పోరు సాగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ 27 స్థానాలు, కాంగ్రెస్ కు 22 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు దక్కాయి. బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశం ఉంది.
I want to quit fighting any type of election: Irom Sharmila after losing election #ElectionResults pic.twitter.com/ednIn2MCow
— ANI (@ANI_news) March 11, 2017
2.30 : మణిపూర్ లో హంగ్ ఏర్పడే అవకాశం, మ్యాజిక్ ఫిగర్ 31కు చేరని పార్టీలు. బీజేపీ, కాంగ్రెలకు చెరి 24 స్థానాలు, ఇతరులకు 9 స్థానాలు.
2.00 : బీజేపీ 13 స్థానాల్లో, కాంగ్రెస్ 13 స్థానాల్లో, ఎన్పీఎఫ్ 3 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో గెలుపు.
1.50 : కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. కాంగ్రెస్ 25, బీజేపీ 19, ఇతరులు 9 స్థానాల్లో గెలుపు
1.09 : బీజేపీ 8 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 10 స్థానాల్లో, ఎన్పీఎఫ్ 3 స్థానాలు, ఇతరులు 4 స్థానాలు కైవసం చేసుకున్నారు.
12.55 : మణిపూర్ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. కాంగ్రెస్ 24, బీజేపీ 14, ఇతరులు 14 స్థానాల్లో ఆధిక్యం లో ఉన్నారు.
12.20 : మణిపూర్ లోని కాంగ్ పోక్పీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నెమ్చా కిప్జెన్ గెలుపు.
12.20 : మణిపూర్ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. ఇప్పటి వరకు ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మిగిలిన స్థానాల్లో కూడా దూసుకుపోతోంది.

12.10 : మణిపూర్ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. కాంగ్రెస్ 20, బీజేపీ 15, ఇతరులు 13 స్థానాల్లో ఆధిక్యం.
12.05 : మణిపూర్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ 14, బీజేపీ 14, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
11.20 : మణిపూర్ లో కాంగ్రెస్ 13, బీజేపీ 11, ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
11.15 : మణిపూర్ ఫలితాలు - కాంగ్రెస్ 1 సీటు గెలుచుకుంది. మరో 13 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. బీజేపీ కూడా 1 స్థానంలో విజయం సాధించింది. మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Manipur CM Okram Ibobi Singh has won from Thoubal seat #ElectionResults pic.twitter.com/yaCIai2h8j
— ANI (@ANI_news) March 11, 2017
10.00 : మణిపూర్ సీఎం ఇబోబీ సింగ్ తోబల్ నియోజక వర్గంలో విజయం సాధించారు. ఇక్కడ ఆయనపై తొలిసారిగా పోటీకి దిగిన ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిలకు ఓటమి తప్పలేదు.
9.40 : మణిపూర్ లో కాంగ్రెస్ పుంజుకుంది. బీజేపీ కన్నా స్వల్ప ఆధిక్యలో కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ 12 స్థానాల్లో, బీజేపీ 11 స్థానాల్లో ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
9.39 : మణిపూర్ లో బీజేపీ 9 స్థానాల్లో, కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
9.25 : మణిపూర్ లో బీజేపీకి చారిత్రాత్మక విజయం ఖాయం : రాం మాధవ్
BJP's performance will be historic in Manipur, we had won no seat in 2012 and now we are poised to win majority: Ram Madhav, BJP pic.twitter.com/GM4yLTkGhn
— ANI (@ANI_news) March 10, 2017
9.26 : మణిపూర్ లో బీజేపీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో, బీజేపీ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
9.12 : మణిపూర్ లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో, బీజేపీ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
9.10 : మణిపూర్ డిప్యూటీ సీఎం గైఖంగమ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
9.08 : మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
9.04: మణిపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు స్థానాల్లో, బీజేపీ అభ్యర్థులు రెండు స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
8.50: మణిపూర్ లో ఓట్ల లెక్కింపు సాగుతున్న అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
8.39 : ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ తోబల్ నియోజక వర్గంలో అధిక్యంలో కొనసాగుతున్నారు.
8.38 : మణిపూర్ లో బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో అధిక్యంలో కొనసాగుతున్నాయి. తోబల్ నియోజక వర్గంలో ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల కాస్త వెనకబడినట్లు తెలుస్తోంది.
Visuals from Imphal: Counting of votes for 60-member Assembly underway at eleven centres in Manipur. #ElectionResults pic.twitter.com/GD5TEOsZ7P
— ANI (@ANI_news) March 11, 2017
8.20 : మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఓట్ల లెక్కింపు మొదలైంది. 60 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం 11 కేంద్రాల్లో ప్రారంభమైంది.
7.55 : ప్రధాని నరేంద్ర మోడీ హవా మణిపూర్ లో ఫలితం ఇస్తుందా? 2012 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఊసే లేదు. ఈ అయిదేళ్లలో బీజేపీ బాగా పుంజుకుంది, ప్రస్తుతం కాంగ్రెస్ కు పక్కలో బల్లెంలా తయారైంది. పదిహేనేళ్లుగా మణిపూర్ ను కాంగ్రెస్ పార్టీయే ఏలుతోంది. మరోవైపు మణిపూర్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబీ సింగ్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్ ను ఈసారీ కాంగ్రెస్ తన వశం చేసుకుంటుందా? లేక అస్సాంలో మాదిరిగా బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం మధ్యాహ్నానికి తెలిసిపోతుంది.
7.30 : ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గాలి వీస్తోంది. మణిపూర్ లో ఈసారి బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటవుతుంది - బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్
ఉదయం 7.20 : మణిపూర్ లో కొత్తగా పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ పార్టీని స్థాపించి తొలిసారిగా మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల మాట్లాడుతూ.. ఒకవేళ ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతే 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో అంగబలం, అర్థబలం ఎలాంటి పాత్ర పోషిస్తుందో అందరికీ తెలిసిందేనని, సమాజంలో మార్పు తీసుకురావడానికే తాము ఈ ఎన్నికల్లో పోటీ చేశామని చెప్పారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకమైనవి. రాజ్యసభలో మెజారిటీ దక్కాలంటే కమలనాథులకు ఈ ఎన్నికల్లో విజయం అత్యంత అవసరం. ప్రస్తుతం లోక్ సభలో తగినంత మెజారిటీ ఉన్న బీజేపీ.. రాజ్య సభలో బలం లేక తన నిర్ణయాలకు ఆమోదం పొందలేకపోతోంది. ఒక్క యూపీ నుంచే గరిష్టంగా 31 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు.
ప్రస్తుతం బీజేపీకి యూపీ నుంచి కేవలం ముగ్గురు మాత్రమే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ కలిసి మొత్తంగా 12 మంది సభ్యులు మాత్రమే రాజ్యసభకు వెళ్లగలరు.
ఇక మణిపూర్ విషయానికొస్తే.. ఇక్కడ మొత్తం సీట్లు 60. మేజిక్ ఫిగర్ 31. అంటే.. ఏ పార్టీ అయితే 31 స్థానాల్లో గెలుపొందుతుందో ఆ పార్టీయే అధికారం చేజిక్కించుకుంటుంది. మణిపూర్ లో ఓట్ల లెక్కంపు కాసేపట్లో ముగియనుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే మళ్లీ అధికారంలోకి రానుంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications