వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలితాలు:నితీష్ మూడోసారి, ఊరించి.. బిజెపి చిత్తు, తీన్‌మార్ (ఫోటోలు)

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం భారత దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసింది. ఈ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే ప్రతిపక్షాల పైన పైచేయికి కేంద్రానికి అవకాశం మరింత దొరుకుతుంది. మహాకూటమి విజయం సాధిస్తే జాతీయ రాజకీయాల్లో నితీష్ చక్రం తిప్పుతారు. ప్రధాని మోడీ ఇంటాబయట విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  • ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నియోజకవర్గం నుంచి గెలిపొందారు. సమీప ప్రత్యర్థి హెచ్ఎఎం అభ్యర్థి రవీంద్రరే పైన మూడువేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • నితీష్ కుమార్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
  • బిహార్‌లోని అమర్‌పూర్‌, అస్తావన్‌ నియోజకవర్గాల్లో జెడీయు అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించారు. అమర్‌పూర్‌ నుంచి జనార్దన్‌ మాంఝీ 11,773 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థి మ్రినాల్‌ శేఖర్‌ను ఓడించారు. అస్తావన్‌ నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి జితేంద్ర కుమార్‌ 10444 ఓట్ల తేడాతో లోక్‌జనశక్తి పార్టీ అభ్యర్థి చోటె లాల్‌ యాదవ్‌పై విజయం సాధించారు.
  • బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓటమి నేపథ్యంలో... రాహుల్ గాంధీ ప్రధాని మోడీ పైన మండిపడ్డారు. బిజెపి ఇప్పటికైనా పాలన పైన దృష్టి పెట్టాలని హితవు పలికారు. యువత మనోభావాలు గుర్తించాలన్నారు. దేశాన్ని మోడీ విభజించలేరన్నారు. ప్రచారాలు ఆపేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.
Live Updates: Bihar Assembly Elections: Counting of votes from 8 am
  • ఆధిక్యంలో ఎన్డీయే - మహా కూటమి మధ్య చాలా తేడా వచ్చింది. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయానికి జెడీయూ 103 స్థానాల్లో ముందంజలో ఉండగా, 70 స్థానాల్లో గెలిచింది. బిజెపి 44 స్థానాల్లో ముందంజలో ఉంది. కేవలం 19 స్థానాల్లోనే గెలిచింది.
nitish
  • ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పుడు బిజెపి ఊపు మీద కనిపించింది. ఆ తర్వాత ఇరు కూటములు హోరాహోరీగా నిలిచాయి. ఆ తర్వాత గంట సేపట్లో అంతా తారుమారు అయింది.
nitish
  • 8 జిల్లాల్లో బిజెపి ఒక్క నియోజకవర్గంలోను ఆధిక్యంలో లేదు.
  • గత 2010 ఎన్నికల్లో 91 సీట్లు గెలిచిన బిజెపి ఇప్పుడు అంతకంటే ఇరవై సీట్లు తక్కువగా గెలుస్తోంది.
  • ఇమామ్ గంజ్ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ గెలుపొందారు.
  • మహాకూటమి గెలుపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ముఖ్యమంత్రి, జెడియూ ముఖ్యనేత నితీష్ కుమార్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
Live Updates: Bihar Assembly Elections: Counting of votes from 8 am
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడయింది. బనియాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆర్జేడీ అభ్యర్థి కేదార్ నాథ్ సింగ్ విజయం సాధించారు.
  • బీహార్ ఎన్నికల్లో బిజెపి 75 స్థానాల్లో, మహాకూటమి 158 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు పది స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మహాకూటమి కంటే బిజెపి సగాని కంటే తక్కువగా ఉంది.
  • బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓటమి పైన శరద్ యాదవ్ మాట్లాడుతూ... ఈ ఓటమి ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, వారందరిదీ అని అన్నారు.
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకు పోతోంది. ఇప్పటి వరకు అధికారికంగా అభ్యర్థుల గెలుపు ప్రకటించలేదు. కానీ 148 స్థానాల్లో మహాకూటమి, 83 స్థానాల్లో బిజెపి ముందంజలో ఉంది.
Live Updates: Bihar Assembly Elections: Counting of votes from 8 am
  • బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాలి.
  • తొలుత ముందంజలో ఉన్న బిజెపి ఆ తర్వాత వెనుకబడింది. తొమ్మిదిన్నర గంటల సమయానికి మహాకూటమి 115 స్థానాల్లో ముందంజలో ఉండగా, బిజెపి 87 స్థానాల్లో ముందంజలో ఉంది.
  • మగ్దుంపూర్ నియోజకవర్గంలో జీతన్ రామ్ మాంఝీ వెనుకంజలో ఉన్నారు. ఇమామ్ గంజ్ నియోజకవర్గంలో మాత్రం జీతన్ రామ్ ముందంజలో ఉన్నారు.
  • బైసి నియోజకవర్గంలో మజ్లిస్ అభ్యర్థి ఆధిక్యం
  • మహువా నియోజకవర్గంలో లాలూ మరో తనయుడు తేజ్ ప్రతాప్ ఆధిక్యం
  • రాఘవాపూర్‌లో లాలూ తనయుడు తేజస్వి వెనుకంజ
Live Updates: Bihar Assembly Elections: Counting of votes from 8 am
  • బిజెపి 83, మహాకూటమి 85 స్థానాల్లో ముందంజలో ఉంది.
  • తొమ్మిన్నర గంటల సమయానికి బిజెపి కంటే మహాకూటమి ముందంజలో ఉంది.
  • కుతుంబ నియోజకవర్గంలో మాంఝీ తనయుడు ముందంజ
  • బేలాగంజ్ నియోజకవర్గంలో ఆర్జేడీ నేత సుదేంద్ర ముదంజ.
  • మహాకూటమిలో జేడీయూ కన్నా ఆర్జేడీ ముందంజలో ఉంది.
Live Updates: Bihar Assembly Elections: Counting of votes from 8 am
  • బిజెపి, మహాకూటమిల మధ్య హోరాహోరీ కనిపిస్తోంది. తొలుత వెనుకంజలో ఉన్న మహాకూటమి దూసుకు వచ్చింది. తొమ్మిదింపావు సమయానికి బిజెపి 68, మహాకూటమి 68 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
  • తొమ్మిది గంటల వరకు బిజెపి, మిత్రపక్షాలు 64, మహాకూటమి 55 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
  • పుల్వారీ నియోజకవర్గంలో శ్యామ్ రజాక్ ఆధిక్యంలో ఉన్నారు.
  • జంఝాపూర్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
  • అలీ నగర్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి అబ్దుల్ బరి సిద్ధిఖి వెనుకంజలో ఉన్నారు.
  • ప్రజలు కోరుకుంటే తాను ముఖ్యమంత్రిని అవుతానని జీతన్ రామ్ మాంఝీ అన్నారు.
  • గయా పట్టణంలో బిజెపి అభ్యర్థి ప్రేమ్ కుమార్ ఆధిక్యం
Live Updates: Bihar Assembly Elections: Counting of votes from 8 am
  • గం.8.45 నిమిషాల వరకు బిజెపి కూటమి 37, మహాకూటమి 22 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
  • పాట్నా సాహిబ్‌లో బిజెపి అభ్యర్థి నందకిషోర్ యాదవ్ ముందంజలో ఉన్నారు.
  • అలౌలి నియోజకవర్గంలో పశుపతి పరాస్ (ఎల్జేపీ) ముందంజలో ఉన్నారు.
  • మఖ్దుంపూర్ నియోజకవర్గంలో మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ ముందంజ.
  • రాఘవపూర్ నియోజవకవర్గంలో లాలూ తనయుడు తేజస్వి ముందంజ.
Live Updates: Bihar Assembly Elections: Counting of votes from 8 am
  • ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే దూసుకుపోతోంది. ఎనిమిదిన్నర వరకు బిజెపి 28 స్థానాల్లో, మహాకూటమి 11 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
  • 2010 ఎన్నికల్లో బిజెపి - జెడీయులు కలిసి పోటీ చేశాయి. అప్పుడు జెడీయుకు 115, బిజెపికి 91 సీట్లు వచ్చాయి. నాటి విపక్షం ఆర్జేడీ 22 స్థానాల్లో మాత్రమే గెలిచింది. స్వతంత్రులు 6 స్థానాల్లో, ఇతరులు 9 స్థానాల్లో గెలిచారు.
  • 3450 మంది అభ్యర్థుల భవితవ్యం కొన్ని గంటల్లో తేలనుంది.
  • తాము బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.
  • ఎన్నికల కమిషన్ గెలుపు ర్యాలీలని బీహార్ రాష్ట్రవ్యాప్తంగా నిషేధించింది.
  • 243 నియోజకవర్గాలకు... బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. మధ్యాహ్నంలోగా ఫలితాలు తేలే అవకాశముంది. 39 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. 14,500 సిబ్బందితో ఓట్లు లెక్కిస్తున్నారు.
English summary
Here are the latest live updates from high stakes Bihar Assembly Election 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X