బెంగళూరుకు ఏదో తెలియని ఆకర్షణ ఉంది.. అదే నన్ను ఆ పనికి ప్రేరేపించింది..
బెంగళూరులో జీవితంపై ఓ నెటిజన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని పరిస్థితులు లవ్ అండ్ హేట్ కలగలిసిన అనుభూతిని ఇస్తాయని ఆయన తన పోస్ట్‌లో వివరించారు. దీనిపై సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై డిబేట్ నడుస్తోంది. పలువురు యూజర్లు మిక్స్డ్ రిప్లైలు ఇస్తోన్నారతనికి.
ఆ యూజర్ తన అసలు పేరును ఎక్కడా మెన్షన్ చేయలేదు. అతను మలయాళీ. స్వస్థలం కేరళలోని కన్నూర్. 26 ఏళ్ల ఆ యూజర్.. ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్నాడు. 'రెసిడెంట్ ఆఫ్ కోకోనాడ్' అనే యూజర్ నేమ్ తో బెంగళూరు లైఫ్ కు సంబంధించిన కొన్ని అనుభవాలను షేర్ చేసుకున్నాడు. దీనికి Living in Bangalore is a love-hate situation! అని హెడ్డింగ్ పెట్టాడు.

తన స్వస్థలం- బెంగళూరు మధ్య నిరంతరం సాగే ఓ మానసిక సంఘర్షణను గురించి ఇందులో రాసుకొచ్చాడు. "నేను బెంగళూరులో నాలుగేళ్లుగా నివసిస్తున్నాను. ఈ సిటీ నన్ను ఎలా ఇంతగా ప్రభావితం చేస్తోందో అనేది అర్థం కావట్లేదు.." అని పేర్కొన్నాడు. బెంగళూరులోని అనూహ్య వాతావరణం తన సహనానికి పరీక్షగా నిలిచినా, ఏదో తెలియని ఆకర్షణతో తనను ఇక్కడే కొనసాగేలా చేస్తోందని వివరించాడు.
"ఉదయం ఎండగా ఉంటుంది. వర్షం పడదనే ధైర్యంతో మనం గొడుగు లేదా రెయిన్‌కోట్ తీసుకోకుండా ఆఫీసుకు బయలుదేరి వెళ్లిపోతాం. రెండు నిమిషాల తర్వాత వర్షం వెర్రెక్కించేలా కురుస్తుంది. అప్పుడు ట్రాఫిక్‌లో తడిసి ముద్దయిపోతాం. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడతాం." అని తన అనుభవాన్ని వివరించాడు.
ఈ అసహన పరిస్థితి తనను తన సొంత రాష్ట్రం కేరళకు తిరిగి వెళ్లాలనే ఆలోచనను కలిగిస్తుందని, ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ మరోలా ఉంటుందని ఆ యూజర్ పేర్కొన్నాడు. కన్నూర్‌కు వెళ్లినప్పుడు మళ్లీ ఎప్పుడెప్పుడు బెంగళూరులో అడుగు పెడదామా? అనిపిస్తుంటుందని, ఇక్కడి వాతావరణాన్ని మిస్ అయ్యాననే భావన కలిగిస్తుందని రాసుకొచ్చాడు.
"నేను కేరళకు వెళ్లినప్పుడు, ప్రతి ఒక్కరూ నన్ను పరాజితుడిలా చూస్తారు. పొరుగువారు గానీ, బంధువులు గానీ గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతుంటారు. ఇది నన్ను చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. బెంగళూరులో ఉన్నంత స్వేచ్ఛ నాకు కన్నూర్ లో లభించదు.." అని పేర్కొన్నాడు.
"బెంగళూరులో ఉన్నప్పుడు ఇంటికి వెళ్లాలని అనిపిస్తుంది. కేరళకు చేరుకోగానే బెంగళూరును పిచ్చిగా మిస్ అవుతాం" అని తేల్చి చెప్పాడు. బెంగళూరు కంటే ముందు వృత్తిరీత్యా కొన్ని వేర్వేరు నగరాల్లో నివసించానని, బెంగళూరులోని ఈ లవ్ అండ్ హేట్ అనే సంఘర్షణ ఎప్పుడూ ఎదురు కాలేదని, అదే ఈ సిటీ తనకు ఎంతో ప్రత్యేకమైనదని వ్యాఖ్యానించాడు.
బెంగళూరులో భారీ సంఖ్యలో మలయాళీలు నివసిస్తోండటం, ప్యూర్ కేరళ ఆహారాన్ని అందించే రెస్టారెంట్లు ఉండటం కూడా తనను వేరే నగరానికి వెళ్లాలనిపించేలా చేయట్లేదని వివరించాడు. ఈ పోస్ట్.. వైరల్ అయింది. బెంగళూరు, ఇక్కడి వాతావరణంపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అవకాశాలపరంగా బెంగళూరు బెస్ట్ సిటీగా ఓ యూజర్ రిప్లై ఇచ్చాడు. ఐటీ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. ఇక్కడి వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుందని, కేరళలో వేడి, గాలితో తేమశాతం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఎక్కువ రోజులు పని చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు.
రెండేళ్ల కిందట బెంగళూరుకు వచ్చానని, ఇక్కడి వాతావరణం అలవాటైన తరువాత.. 25 డిగ్రీల ఎండ వేడిని కూడా తట్టుకోలేకపోతున్నానని మరో యూజర్ వ్యాఖ్యానించాడు. ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ఓవెన్‌లో చిక్కుకున్నట్లు అనిపిస్తుందని అంటూ లాఫింగ్ ఎమోజీ ఇచ్చాడు.
మరి కొందరు యూజర్లు ఈ అభిప్రాయాలతో విభేదించారు. బెంగళూరు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తుచేసుకున్నారు. ఇక్కడి ట్రాఫిక్ జామ్‌ల గురించి రాసుకొచ్చాడు. ఎప్పుడూ ట్రాఫిక్‌లో చిక్కుకునేవాళ్ళమని, దాన్ని వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సొచ్చిందని పేర్కొన్నాడు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications