ఒకటి కాదు .. రెండు కాదు ... 24 ఏళ్లు : భారతదేశ పౌరసత్వం కోసం ఎదురుచూసిన పాకిస్థాన్ అక్కాచెల్లెళ్లు
న్యూఢిల్లీ : భారతదేశం .. భిన్నత్వంలో ఏకత్వం, భిన్న మతాలు, ఆచారాలు, వ్యవహారాల నెలవు. ఇక్కడ ఉండేందుకు ఇతరదేశాల వారు ఇష్టపడతారు. పాకిస్థాన్ పౌరసత్వం కలిగిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా దేశంపై అభిమానం పెంచుకున్నారు. అయితే చుట్టపు చూపుగా ఉండటం కాదు ... ఈ దేశ పౌరసత్వం కోసం వారు దాదాపు 24 ఏళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు.

సేవ్ డేట్ ..
మార్చి 19, 2019ని తమ జీవితంలో మరచిపోలేమంటున్నారు నిదా, మహరుఖ్ నసీం అనే అక్కాచెల్లెళ్లు. పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించిన వీరు .. 1995లో ఇండియాకు వచ్చారు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు. పౌరసత్వం కోసం గత 24 ఏళ్ల నుంచి వేచి చూస్తున్నారు. తమ చిరకాల స్వప్నం నెరవేర్చిన ప్రధాని మోదీకి ఆ ఇద్దరు మహిళలు కృతజతలు తెలిపారు. 'మేం ఈ రోజును జీవితంలో మరచిపోలేం అన్నారు. ఎప్పుడైతే ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లామో .. ఆ అధికారులు కూడా మీరు మీ దేశానికి వెళ్లిపోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశ పౌరసత్వం ఇవ్వడం అంత ఈజీ కాదని చెప్పారు‘ అని తెలిపారు.

1989లో పెళ్లి .
వీరి తల్లిదండ్రులు 1989లో పెళ్లి చేసుకున్నారు. వారి తండ్రి అక్తర్ భారతదేశ పౌరుడు కాగా .. తల్లి పాకిస్థానీ. ఆమెకు 2007లో భారతదేశ పౌరసత్వం వచ్చింది. వారి కూతుళ్లు ఇద్దరికీ 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సిటిజెన్ షిప్ వచ్చింది. తమ కూతుళ్ల పౌరసత్వం కోసం నజీమ్ అక్తర్ పలుమార్లు దరఖాస్తు చేశారు. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా వారి మొర అలకించలేదు. కానీ 2014లో వారణాసిలో మినీ పీఎంవో ఏర్పాటు చేశారు. అక్కడ తాము దరఖాస్తు చేయడంతో తమ సమస్య పరిష్కారమైందని తెలిపారు.

ఇబ్బందులను ఎదుర్కొన్నాం ..
ఇప్పటికీ తమ సోదరుడు పాకిస్థాన్ లో ఉన్నాడని మహరుఖ్ తెలిపారు. దీంతో తాము జాతీయత విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలిపారు. వారణాసి నుంచి మోదీ గెలిచాక తమ సమస్య ఆలకించారని ... మరోసారి రమ్మని కూడా పిలువలేదని చెప్పారు. తాము ఇక్కడే చదువుకున్న జాతీయతను మాత్రం పాకిస్థాన్ అని రాయాల్సి వచ్చేదని గుర్తుచేశారు నిదా. ఇక్కడ ఉంటూ .. పాకిస్థాన్ అని జాతీయత గురించి రాయడం ఇబ్బంది కలిగేదన్నారు.
-
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్‌ఫర్డ్‌లో "ఏఐ" పై ప్రసంగం..! -
పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ యుద్ధానికి రంజాన్ సెలవులు..! -
ఇగో తగ్గని ప్లేయర్లు.. దిక్కులేని బోర్డు.. పాక్ క్రికెట్‌ను ముంచేది వీళ్లేనా? -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications