ఫిబ్రవరిలో టి బిల్లు: అద్వానీ, టిడిపి పొత్తుపై అరుణ్ జైట్లీ

LK Advani on Telangana Bill
హైదరాబాద్: ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, తెలంగాణ బిల్లును కేంద్రం ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడుతుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ ఆద్వానీ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తుందని కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ చేసిన ప్రకటనను అద్వానీ ద్రువీకరించడం గమనార్హం.

బిజెపి నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ గురువారం విలేకరులకు తన నివాసంలో కొత్త సంవత్సరం విందు ఇచ్చారు. ఈ విందుకు బిజెపి నాయకులు హాజరయ్యారు. విందు సమయంలో విలేకరులతో పిచ్చాపాటీగా మాట్లాడారు.

తెలంగాణ బిల్లు పార్లమెంటుకు ఎప్పుడు వస్తుందని ప్రశ్నించగా ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశముందని, అందుకే ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా నిరవధిక వాయిదా మాత్రమే వేసిందని, ఈ భేటీలోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశముందన్నారు.

ఫిబ్రవరి మొదటి వారంలో జరిగేవి శీతాకాల సమావేశాలకు పొడిగింపు మాత్రమేనని, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సిన అవసరం లేదని, బడ్జెట్ సమావేశాల సందర్భంగానే రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అద్వానీ తెలిపారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖరారైందా అని ఆరా ప్రశ్నించగా.. ఖరారు కాలేదని, ఏం చేసినా మీడియాకు చెప్పే చేస్తామని అరుణ్ జైట్లీ తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం మంత్రి జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో సమావేశాలు ఉంటాయని, తెలంగాణ బిల్లు వస్తుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+