• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అద్వానీ, ఉమా భారతి, జోషి, ప్రవీణ్ తొగాడియా..ద వారియర్స్ ఆఫ్ రామ మందిర్: కీర్తిస్తోన్న బీజేపీ క్యాడర్

|

న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సానుకూల తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. భారతీయ జనతాపార్టీ కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీ ఒక్కటే కాకుండా.. దాని అనుబంధంగా కొనసాగుతోన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గానీ, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) గానీ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇక అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి అవసరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నారు. రామ మందిరం నిర్మాణానికి అవసరమైన సామాగ్రి ఇప్పటికే అయోధ్యలో సిద్ధంగా ఉందని, పనులను మొదలు పెట్టడమే ఆలస్యమని అంటున్నారు.

Ayodhya Verdict: అయోధ్య వివాదాస్పద భూమి హిందువులకు.. ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం: సుప్రీంకోర్టు

ఒరిజినల్ వారియర్స్.. వారే

ఒరిజినల్ వారియర్స్.. వారే

ఈ పరిస్థితుల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కృషి చేసిన లాల్ కృష్ణ అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషి, వినయ్ కతియార్, గోవిందాచార్య, కల్యాణ్ సింగ్, వీహెచ్ పీ నేత ప్రవీణ్ భాయ్ తొగాడియా వంటి పార్టీ సీనియర్ నేతల శ్రమను గుర్తు చేసుకుంటున్నారు. వారంతా రామ మందిరం నిర్మాణ వ్యవహారంలో ఒరిజినల్ వారియర్స్ అని కీర్తిస్తున్నారు. రామ మందిర నిర్మాణం కోసం అద్వానీ దేశవ్యాప్తంగా రథయాత్రను నిర్వహించారని గుర్తు చేస్తున్నారు. ఇంత వృధ్యాప్యంలోనూ వారు న్యాయపరమైన కేసులను ఎదుర్కొంటున్నారని, వాటిని ఎత్తేయాలని కోరుతున్నారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులు..

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులు..

1992 డిసెంబర్ 6వ తేదీన విశ్వహిందూ పరిషత్, బీజేపీ, ఈ రెండింటి అనుబంధ సంస్థలకు చెందిన కొందరు నాయకులు.. లక్షన్నర మంది మంది కరసేవకులతో అయోధ్యలోని ఈ వివాదాస్పద స్థలం దగ్గర ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శన అనంతరం కరసేవకులు బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. ఈ ఘటనకు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కల్యాణ్‌ సింగ్, వినయ్ కటియార్, ఉమా భారతి, గోవిందాచార్య, ప్రవీణ్ తొగాడియాలను ప్రధాన కారకులుగా గుర్తించారు. వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికీ ఈ కేసులు కొనసాగుతున్నాయి.

దేశాన్ని ఏకం చేసిన నేతలుగా..

దేశాన్ని ఏకం చేసిన నేతలుగా..

అయోధ్యలో నిర్వహించి మహా ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షల మంది వరకు కరసేవకులు హాజరు అయ్యేలా అద్వానీ, ఉమా భారతి వంటి నాయకులు ప్రయత్నించారు. తమ ప్రసంగాలతో వారిలో ఉత్తేజాన్ని నింపారని, ఒకేసారి లక్షన్నకు పైగా కరసేవకులు ఒకే ప్రాంతంలో హాజరయ్యేలా చేయడంలో సఫలం అయ్యారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అప్పట్లో వారు దీనికి పూనుకుని ఉండకపోతే.. పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. రామజన్మభూమిలో రామమందిరాన్ని నిర్మించాలనే కల సాకారం అయ్యేది కాదేమోననే అభిప్రాయం బీజేపీ కార్యకర్తల్లో వ్యక్తమౌతోంది.

 ప్రస్తుతం వారి పరిస్థితేంటీ.. ?

ప్రస్తుతం వారి పరిస్థితేంటీ.. ?

రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో ముఖ్య పాత్రను పోషించిన నాయకులందరూ ప్రస్తుతం రాజకీయాల నుంచి దాదాపు వైదొలగినట్టే కనిపిస్తోంది. వయస్సు మీద పడటం వల్ల అద్వానీ రాజకీయాల్లో చురుకుగా ఉండట్లేదు. శుక్రవారమే ఆయన 92వ పుట్టినరోజును జరుపుకొన్నారు. భారతీయ జనతాపార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఉమా భారతి మంత్రివర్గంలో కొనసాగారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల మంత్రివర్గం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆమె గంగాయాత్రను చేస్తున్నారు. గంగమ్మ తల్లి జన్మించిన స్థలం గంగోత్రి నుంచి సముద్రంలో విలీనం అయ్యే గంగాసాగర్ వరకూ ఈ యాత్ర కొనసాగుతోంది.

మిగిలిన వారూ అంతంతే..

మిగిలిన వారూ అంతంతే..

బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఫైజాబాద్ లోక్ సభ సభ్యునిగా ఉన్న వినయ్ కతియార్ కూడా దాదాపుగా రాజకీయాల నుంచి వైదొలగినట్టే కనిపిస్తోంది. 1992లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కల్యాణ్ సింగ్, గోవిందాచార్య చాలాకాలం కిందటే రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. రాష్ట్రీయ స్వాభిమాన్ మంచ్ ను ఏర్పాటు చేసిన గోవిందాచార్య ప్రస్తుతం పెద్దగా వార్తల్లో లేరు. కల్యాణ్ సింగ్ ప్రారంభంలో రాజస్థాన్ గవర్నర్ గా పనిచేశారు. వీహెచ్ పీ అధినేతగా పని చేసిన ప్రవీణ్ తొగాడియా కూడా వార్తల్లో ఉండట్లేదు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. వారందరినీ గుర్తు చేసుకుంటున్నారు బీజేపీ కార్యకర్తలు.

English summary
There is an image of former union minister Uma Bharti with her arms around Murli Manohar Joshi. In another, Bharti, a coy smile playing on her lips, is seen in the company of (late) VHP leader Ashok Singhal, Advani, Joshi and former BJP MP Vinay Katiyar the latter three standing with their hands joined in a gesture of victory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X