Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేడమ్ ఎమ్మెల్యే, తండ్రి మంత్రి, పగలే రాళ్లతో దాడి, కుప్పం పక్కలో ఏంజరిగింది ?

బెంగళూరు/కేజీఎఫ్: కర్ణాటకలో (Karnataka) మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (congress) పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీజేపీ నాయకులు సైలెంట్ అయిపోయారు. అయితే కర్ణాటకలో ఇప్పుడే లోకల్ రాజకీయాలు మొదలు కావడంతో అసలు స్క్రీన్ ప్లే మొదలైయ్యింది.

చాలా రోజులుగా వివాదానికి కారణమైన రోడ్డు విస్తరణలో హై డ్రామా చోటు చేసుకుంది. కర్ణాటకలోని కోలారు జిల్లాలోని కేజీఎఫ్ (KGF) ఎమ్మెల్యే రూపకళ మీద రాళ్లతో దాడి చెయ్యడానికి ప్రయత్నించిన ఘటన కోలార్‌ (Kolar) జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డు వెడల్పు పనులు చేసే సమయంలో ఆక్రమణను తొలగిస్తుండగా ఓ వ్యక్తి కేజీఎఫ్ (KGF) ఎమ్మెల్యే రూపకళ మీద రాళ్లతో దాడి చేయడంతో అందరూ హడలిపోయారు.

Locals attacked KGF lady MLA Rupa with stones while removing illegal constructions in

కోలార్ జిల్లాలోని కేజీఎఫ్ (KGF) తాలూకాలోని బేతమంగళలో శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల సమయస్ఫూర్తితో కేజీఎఫ్ (KGF) ఎమ్మెల్యే రూపకళను ప్రమాదనం నుంచి తప్పించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కేజీఎఫ్ (KGF) లేడీ ఎమ్మెల్యే రూపకళకు పెనుప్రమాదం తప్పిందని, ఆమెను సురక్షితంగా రక్షించామని పోలీసు అధికారులు అంటున్నారు.

కేజీఎఫ్ (KGF) ఎమ్మెల్యే రూపకళ నేతృత్వంలో అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే (MLA) రూపకళ, జేసీబీలపై రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు (MLA) అదుపులోకి తీసుకున్నారు. వివాదానికి కారణమైన రోడ్డును క్లియర్ చేసేందుకు ఎమ్మెల్యే రూపకళ శనివారం రంగంలోకి దిగారిని, అక్రమ కట్టడాలు తొలగిస్తున్న సమయంలో ఆగ్రహం చెందిన ఓ వ్యక్తి ఎమ్మెల్యే , జేసీబీలపై రాళ్లు రువ్వాడని పోలీసులు అంటున్నారు.

ఇప్పటికీ బేతమంగళ నుంచి వి. కోట (ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం (kuppam) నియోజక వర్గం)కు వెళ్లే పాత మద్రాసు (Chennai) రోడ్డు గత కొన్నేళ్లుగా ఎలాంటి క్లియరింగ్‌ చేపట్టకుండానే శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఈరోజు ఎమ్మెల్యే రూపకళ ఆమె అక్కడే నిలబడి అక్రమ కట్టడాలను ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రూపకళ ఆధ్వర్యంలోనే పనులు చేపట్టిన పీడబ్ల్యూడీ (PWD)అధికారులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు.

ప్రస్తుతం కేజీఎఫ్ (KGF) ఎమ్మెల్యే రూపకళ సమక్షంలోనే తరలింపు కార్యక్రమం కొనసాగుతుండడంతో ఆ ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో గట్టి పోలీసు (police) బందోబస్తు ఏర్పాటు చేశారు. రాళ్లతో దాడికి యత్నించిన వ్యక్తిని బేతమంగళ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపకళ తండ్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేహెచ్. మునియప్ప ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా (Minister) పని చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+